BigTV English

Producers Meet : చర్చలు మళ్లీ వాయిదా… ఈ పంచాయితీకి ఇక పరిష్కారం లేదా..?

Producers Meet : చర్చలు మళ్లీ వాయిదా… ఈ పంచాయితీకి ఇక పరిష్కారం లేదా..?

Producers Meet : గత కొన్ని రోజులుగా ప్రేక్షకుడు థియేటర్ కి రావడంలో వెనుకడుగు వేస్తున్న నేపథ్యంలో థియేటర్ యాజమాన్యం అద్దె కట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో థియేటర్లు జూన్ 1 నుంచి బంద్ చేయాలని ఇటు ఎగ్జిబిటర్లు డిమాండ్ చేయగా థియేటర్లు బంద్ చేయడం కుదరదని అటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా తేల్చి చెప్పారు. అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూ ఉండగా ఇప్పుడు ఈ చర్చలు వాయిదా వేశారు. కానీ పంచాయతీకి మాత్రం ఒక పరిష్కారం లభించలేదు. మరి ఈరోజు జరిగిన సమావేశంలో అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


మళ్లీ చర్చలు వాయిదా.. పరిష్కారం సంగతేంటి?

ఈ రోజు ఎగ్జిబిటర్ల డిమాండ్ మేరకు ఫిలిం ఛాంబర్ లో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఇందులో ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రెటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. “థియేటర్ లు మూసివేయడం లేదు. అటు బంద్ కూడా లేదు. ఈనెల 30వ తేదీన ఈసీ మీటింగ్లో కమిటీ వేస్తాము. ఎగ్జిబిటర్ల పర్సంటేజీ అంశంపై ఒక కమిటీ వేసి, ఒక టైం లైన్ పెట్టుకుని అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని, ఆ తర్వాత సమస్యను పరిష్కరిస్తాము. అప్పటివరకు థియేటర్ల బంద్ ను నిలిపివేస్తున్నాం” అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక ఈరోజు జరిగిన ఈ సమావేశంలో చర్చలు వాయిదా పడ్డాయి కానీ ఈ పరిస్థితికి ఇప్పటివరకు పరిష్కారం దొరకలేదు అని చెప్పవచ్చు. మరి ఈనెల 30వ తేదీన వేసే ఈసీ మీటింగులో ఫిలిం ఛాంబర్ ఒక నిర్ణయానికి వస్తుందేమో చూడాలి. ఇక అప్పటివరకు ఎగ్జిక్యూటర్లు నష్టాన్ని భరించాల్సిందేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


థియేటర్ బంధ్ వెనుక ఆ నలుగురి హస్తం..

జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాలు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే విషయంపై విచారణ చేపట్టాలని అసలు ఈ నిర్ణయం వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి దిశా నిర్దేశం చేశారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూవీ టార్గెట్ గా చేసుకొని ఆ నలుగురు నిర్మాతలే థియేటర్లు మూసివేయాలని వెనుక నుంచి ఒత్తిడి చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ స్పందిస్తూ.. హోంశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కుమార్ విశ్వజిత్ తో మాట్లాడారు. ఈ పరిణామంతో పాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్ర్టెల్ గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించి విచారణ చేయాలని ఆయన తెలిపారు. ఇలా సడన్ గా సినిమా హాల్స్ మూసివేత వల్ల ఎన్నో సినిమాలు ప్రభావితం అవుతాయని, ఎంత టాక్స్ రెవెన్యూకి విఘాతం కలుగుతుంది అనే కోణంలో కూడా వివరాలు సేకరించమని స్పష్టం చేశారు. ఇకపోతే జూన్ 1 సినిమా బంద్ చేయాలని వార్తలు వస్తున్నా నేపథ్యంలో జూన్ 1 నుండి థగ్ లైఫ్, హరిహర వీరమల్లు ఇలా పలు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి సమయంలో బంద్ చేయడం సరికాదని నిర్మాతలు తెలిపారు.

ALSO READ:Bhairavam Censor Talk: భైరవం సెన్సార్ రివ్యూ… ఇది ముగ్గురు హీరోలకు గుర్తుండిపోద్ది..!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×