Bhairavam Censor Talk:ప్రముఖ డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం భైరవం.. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలయికల రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వీరి ముగ్గురికి జోడిగా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గుడి, ముగ్గురు స్నేహితుల చుట్టూ సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతోంది.
భైరవం మూవీ సెన్సార్ రివ్యూ..
ఇదిలా ఉండగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. అందులో భాగంగానే సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ‘ఏ’ (A) సర్టిఫికెట్ జారీ చేసింది. అలాగే 2 గంటల 35 నిమిషాల నిడివితో రన్ టైమ్ లాక్ చేశారు. ముఖ్యంగా సినిమా చూసిన సెన్సార్ నిర్వాహకులు సినిమాపై తమ రివ్యూ కూడా పంచుకున్నారు. ఈ సినిమా ఈ ముగ్గురు హీరోలకు జీవితాంతం గుర్తుండిపోతుంది అని కూడా తెలిపారు. ఇక సెన్సార్ ఇచ్చిన రివ్యూ విషయానికి వస్తే.. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ అదిరిపోయిందని, ఎమోషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని సెన్సార్ నిర్వాహకులు తెలిపారట. అంతేకాదు ఈ సినిమా క్లైమాక్స్ ఎప్పటికీ గుర్తిండిపోయేలా అత్యద్భుతంగా తీర్చిదిద్దారట. ప్రత్యేకించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అని కూడా సెన్సార్ సభ్యులు రివ్యూ ఇచ్చినట్లు ఇన్సైడ్ టాక్. ఈ విషయం తెలిసి మాస్ , యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలను ఇష్టపడే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సెన్సార్ బోర్డు నిర్వాహకులే ఈ రేంజ్ లో రివ్యూ ఇచ్చారు అంటే ఇక తెరపై ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో చూడాలి అని మరింత ఎక్సైట్మెంట్ వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
ట్రెండింగ్ లో భైరవం బాయ్ కాట్..
ఇకపోతే ప్రస్తుతం భైరవం మూవీ బాయ్ కాట్ అంటూ ట్రెండింగ్ లో నిలిచింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఏలూరులో ఈనెల 18న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ విజయ్ కనకమేడల పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసిన కామెంట్లు అటు వైసిపి నేతలలో పెద్ద ఎత్తున వ్యతిరేకతను కలిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భైరవం సినిమాను బాయ్ కాట్ చేయాలి అంటూ మండిపడ్డారు. అసలు విషయంలోకి వెళ్తే.. విజయ్ కనకమేడల..” ధర్మాన్ని కాపాడడానికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తుంటారు. సరిగ్గా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా కాపాడడానికి గత ఏడాది ఒకరు వచ్చారు” అంటూ రాజకీయాలను ఉద్దేశించి చేశారు అని వైసిపి నేతలు భైరవం మూవీని బాయ్ కాట్ చేయాలంటూ ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. ఈ విషయంపై మంచు మనోజ్ కూడా స్పందిస్తూ ఒక అభిమానిగానే కామెంట్లు చేశారని క్లారిటీ ఇచ్చారు.
ALSO READ:Star Heroine: ప్రశాంతత కోసం 3 పెళ్లిళ్లు.. అయినా నరకం నుండి బయటపడలేకపోయిన స్టార్ హీరోయిన్!