BigTV English

Guntur Kaaram: ఈ సినిమా ఫ్లాప్ అనే వాళ్లకి సాలిడ్ ఆన్సర్

Guntur Kaaram: ఈ సినిమా ఫ్లాప్ అనే వాళ్లకి సాలిడ్ ఆన్సర్

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతాయి. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గుంటూరు కారం’ మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కానీ, విడుదలైన తర్వాత సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ ను ఎదుర్కొంది. సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఫ్యాన్స్‌లో కొంతమందికి సినిమా పర్వాలేదనిపించింది, మరికొందరికి ఆశించిన స్థాయిలో లేదని భావించారు. అయితే, సినిమాను పూర్తిగా ఫ్లాప్ అని లేబుల్ వేయడం ఎంతవరకు నిజం?


ఫ్యాన్స్ డిజప్పాయింట్మెంట్ – అసలు కారణం ఏంటి?

త్రివిక్రమ్ నుంచి ఫ్యాన్స్ వైబ్రెంట్ కథ, పవర్ ఫుల్ డైలాగ్స్, స్టైలిష్ ట్రీట్‌మెంట్ ఆశించారు. కానీ, గుంటూరు కారం సినిమా కోర్ లోనే మదర్ సెంటిమెంట్ ఉంది. పైన ఎన్ని మెరుపులు అద్దినా మాస్ సినిమాగా కాకుండా గుంటూరు కారం సినిమా క్లీన్ ఫ్యామిలీ సినిమాగానే ప్రాజెక్ట్ చేసి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేదేమో. ఈ కారణంగా కొన్ని క్లాసిక్ ఎలిమెంట్స్ ఆశించిన ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు. అలాగే, త్రివిక్రమ్ గత సినిమాలతో పోల్చితే డైలాగ్స్ ఇంపాక్ట్ తక్కువగా ఉన్నాయని, కథలో కొత్తదనం పెద్దగా లేదని కామెంట్స్ వచ్చాయి. అయితే, కమర్షియల్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ బాగుండటంతో సినిమా బాగా నడిచింది. ఇక రిలీజ్ సమయంలో సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఏ సినిమా విడుదలైనా ట్రోలింగ్ కామన్ అయిపోయింది. ‘గుంటూరు కారం’ విషయంలో కూడా అదే జరిగింది, నిజానికి ఇంకాస్త ఎక్కువే జరిగింది. అయితే, సోషల్ మీడియాలో నెగటివ్ బజ్ వచ్చినా సినిమా కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి.


కలెక్షన్ల లెక్కలు – ప్రొడ్యూసర్ ఏం చెప్పారు?

మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్స్ లో నాగ వంశీ మాట్లాడుతూ, “నైజాం మినహా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది. ప్రొడ్యూసర్‌గా నాకు డబ్బులు మిగిలించిందే తప్ప నష్టపెట్టలేదు” అని చెప్పారు. అంటే, బయ్యర్లకు పెద్దగా నష్టమేమీ లేదు. నిజానికి ఓ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యిందంటే, అది కనీసం ఓవరాల్‌గా మంచి రన్ ఇచ్చినట్టే. ఈ సినిమా కొంతమంది ఆశించిన రేంజ్‌లో లేకపోయినా, మహేష్-త్రివిక్రమ్ కాంబో పట్ల క్రేజ్ తగ్గలేదు.
త్రివిక్రమ్ మరోసారి మహేష్ కోసం స్క్రిప్ట్ ప్లాన్ చేస్తే, మరో ‘అతడు’ లాంటి మ్యాజిక్ క్రియేట్ కావచ్చు!

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×