Anchor Soumya: బుల్లి తెరపై యాంకర్లుగా కొనసాగుతున్న వారిలో కొందరు తమ పరిస్థితి కారణంగానే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయం పై ఎంతో మంది స్పందించారు. కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతోనే జాబ్స్ కూడా వదిలి బుల్లితెర పై యాంకర్స్ కొనసాగుతున్నారు. తమ టాలెంట్ తో ఒక్కో షోతో పాపులారిటిని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్స్ కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ ను అందుకుంటున్నారు. అలాంటి వారిలో సుమ, శ్రీముఖి, రష్మీ లతో పాటుగా చాలా మంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం జబర్దస్త్ కు వచ్చిన యాంకర్ సౌమ్య అందరికి గుర్తే ఉంటుంది. తాజాగా ఆమెకు సంబందించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..
కన్నడ బ్యూటీ సౌమ్యా రావు తెలుగు టీవీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన పేరు. ఒకప్పుడు ‘జబర్దస్త్’ వేదిక పై తన హాస్యంతో ప్రతి ప్రేక్షకుడి మన్ననలు అందుకున్న ఈ యాంకర్ అప్పట్లో ఎంతగా వైరల్ అయ్యిందో తెలిసిందే.. సోషల్ మీడియా లో లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. అయితే కొన్ని రోజులు జబర్దస్త్ షోలో కొనసాగిన ఈ అమ్మడు ఇప్పుడు ఇండస్ట్రీలో పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల గురించి చెప్పింది. ఆ ఇంటర్వ్యూ వీడియో ఆసక్తికరంగా ఉండటంతో ఆమె ఫ్యాన్స్ దీన్ని ఇంకాస్త వైరల్ చేస్తున్నారు. అసలు ఆమె ఇంటర్వ్యూలో ఏం చెప్పిందో చూద్దాం..
ఇంటర్వ్యూలో సౌమ్య రావు తన గురించి పూర్తి వివరాలను బయట పెట్టింది. ఆమె పుట్టి పెరిగింది బెంగుళూరులో తెలుగు నాకు పెద్దగా రాదు కానీ తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ప్రేమగా స్వీకరించారు. అంటూ సౌమ్యారావు కృతజ్ఞత భావం వ్యక్తం చేసింది. తన చిన్ననాటి గురించి ఆమె చెబుతూ, “నా మొదటి గురువు నా అమ్మనే . ఆమె సంగీత క్లాసులు తీసుకుని మమ్మల్ని పోషించేది. కానీ మా కుటుంబం ఒక దశలో ఆర్థిక కష్టాల్లో పడింది. ఇక అమ్మకు ఆరోగ్యం క్షీనించడం తో పాటుగా బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. ఆ కష్టం మా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ కష్టాలు నన్ను మానసికంగా మరింత బలంగా మార్చాయి. అందుకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందని చెప్పింది.. ఆ తర్వాత వరుస సీరియల్స్ చేస్తూ బిజీ అయ్యింది. ఇప్పుడు తెలుగులో కూడా ఈమెకు అవకాశాలు వస్తున్నాయని చెప్పింది. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. తనపై నమ్మకం పెట్టుకున్న ప్రేక్షకులను మళ్లీ అలరించాలనే ఆశలు ఇలా ఆమె కథలో ప్రతి అంశం స్ఫూర్తినిస్తుంది. ఒక యాంకర్ గా తనదైన గుర్తింపును తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటికి తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయని చెప్పింది. అలాగే పలు సినిమాల్లో కూడా ఆమె చెప్పింది.