Sumanth Prabhas : టాలెంట్ ఉన్న వాళ్లకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడు బ్రహ్మరథం పడుతుంది. చాలామంది షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టి నేడు హీరోలుగా నిలబడ్డారు. చాలామంది షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేసి నేడు దర్శకులుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకున్నారు. సుజిత్, తరుణ్ భాస్కర్, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ వంటి ఎంతమంది దర్శకులు నేడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాలు తీశారు. ఇక షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు సాధించుకున్నాడు సుమంత్ ప్రభాస్. ఆ తర్వాత ప్రాంక్ వీడియోస్, కవర్ సాంగ్స్ వీటితో కూడా సుమంత్ ప్రభాస్ బాగా ఫేమస్. ఇక సుమంత్ ప్రభాస్ కూడా మేము ఫేమస్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు.
Also Read : Delhi Ganesh : సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ ఇక లేరు..
మేము ఫేమస్ సినిమాని చాయ్ బిస్కెట్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. దాదాపు ఏ సినిమా ఏడు కోట్ల వరకు కలెక్షన్స్ వసూలు చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమా చూసి ట్వీట్ చేశారు. అప్పట్లో మహేష్ బాబు ట్వీట్ చేయడంపై చాలామంది కొన్ని విమర్శలు కూడా చేశారు. వాస్తవానికి దర్శకుడుగా మొదటి సినిమా అయినా కూడా ఈ సినిమాను బాగానే హ్యాండిల్ చేశాడు సుమంత్. మేము ఫేమస్ సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక సినిమా కూడా సుమంత్ ప్రభాస్ చేయలేదు. ఇక తాజాగా సుమంత్ ప్రభాస్ తన రెండవ సినిమా అప్డేట్ అందించాడు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో సుమంత్ తన రెండవ సినిమాను. ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమం నేడు రామానాయుడు స్టూడియోలో జరగనుంది.
Also Read: Pushpa2 Vs Game Changer : రామ్ చరణ్ vs అల్లు అర్జున్.. పుష్ప గాడు ఎందులో తగ్గేదేలే..
మేము ఫేమస్ సినిమా తర్వాత సుమంత్ ప్రభాస్ దాదాపు 85 కథల వరకు విన్నారట. అయితే ఈ కథ కూడా కంప్లీట్ గా తనకు నచ్చలేదని తెలియజేశాడు. ఒక సందర్భంలో తను కూడా కథ రాసుకుందామని ఫిక్స్ అయ్యాడు. ఆ టైంలో సుభాష్ చంద్ర వచ్చి చెప్పిన కథ బాగా నచ్చిందని తెలియజేసాడు. సుభాష్ చంద్ర అప్పట్లో షార్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్లు. దాదాపు వీరు 100 షార్ట్ ఫిలిమ్స్ వరకు తీశారు. ఈ షార్ట్ ఫిలిమ్స్ లో రాజ్ తరుణ్ కూడా నటించాడు. చాందిని చౌదరి కూడా షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చింది. మొత్తానికి వీళ్లు ఇప్పుడు సినిమా తీయడం మొదలుపెట్టారు. ఇకపోతే 85 కథల వరకు రిజెక్ట్ చేసిన సుమంత్ ప్రభాస్ కి ఈ కథలో నచ్చిన అంత కీలకమైన పాయింట్ ఏంటి అనేది చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.