BigTV English

Siraj Rally In Hyderabad: సిరాజ్ కు బ్రహ్మరథం.. హైదరాబాద్ లో విజయోత్సవ ర్యాలీ

Siraj Rally In Hyderabad: సిరాజ్ కు బ్రహ్మరథం.. హైదరాబాద్ లో విజయోత్సవ ర్యాలీ
Mohammed Siraj Road Show in Hyderabad: విశ్వవిజేతగా నిలిచిన టీమ్ ఇండియా జట్టులో సభ్యుడిలా ఉన్న సిరాజ్ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాడు. దీంతో క్రికెట్ అభిమానులు, బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు అధికారులు, సైబరాబాద్ పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సీఈఓ సునీల్‌ ఎయిర్ పోర్టులో సిరాజ్‌కు స్వాగతం పలికారు. వారిలో పలువురు స్థానిక క్రికెటర్లు ఉన్నారు.

మెహిదీపట్నం సరోజినీ దేవి కంటి ఆస్పత్రి నుంచి పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై ఓపెన్ టాప్ జీప్ నుంచి సిరాజ్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లాడు.


దీంతో అభిమానులు అందరూ ఇండియా, ఇండియా అంటూ బిగ్గరగా కేకలు వేస్తూ, వుయ్ లవ్ సిరాజ్ భయ్ అంటూ హడావుడి చేశారు. విజయోత్సవ ర్యాలీ మెహిదీ పట్నం, మాసబ్ ట్యాంక్, ఖాజా మేన్షన్, పోలీసాఫీర్స్ మెస్, నషేమన్ హోటల్ మీదుగా ఫస్ట్ లాన్సర్ లోని ఈద్గా మైదానం వరకు కోలాహలంగా సాగింది. దారిపొడవునా అభిమానులు జేజేలు పలికారు. సిరాజ్ కూడా ఎంతో ఉత్తేజంగా ప్రజలకు చేతులు ఊపుతూ అభివాదం చేశాడు.

ఈ సందర్భంగా సిరాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ కప్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. రానున్న రోజుల్లో తాను మరింతగా కష్టపడి భారత జట్టుకు మరిన్ని పథకాలు సాధించే విధంగా కృషి చేస్తానన్నాడు. ఛాంపియన్‌గా నిలిచిన అనుభూతి వర్ణించడానికి మాటలు రావట్లేదన్నాడు. ఇది హైదరాబాద్‌కు గర్వించదగ్గ క్షణాలని అన్నాడు. ప్రపంచకప్ గెలవాలనే కల నెరవేరిందని అన్నాడు. అభిమానుల ప్రేమ, మద్దతు చూస్తుంటే మనసు పులకరిస్తోందన్నాడు.


Also Read: నా టీ 20 కెరీర్ లో.. ఆఖరి క్లైమాక్స్ మ్యాచ్ : ప్రధానితో కొహ్లీ

అయితే టీ 20 ప్రపంచకప్ జట్టులో 15 మంది ఫైనల్ స్క్వాడ్ లో ఉన్నాడు.  అమెరికాలో జరిగిన మూడు లీగ్ మ్యాచ్ ల్లో సిరాజ్ ఆడాడు. వికెట్లు రాకపోయినా, పరుగులను నియంత్రిస్తూ బౌలింగ్ చేసి, ప్రత్యర్థులు భారీ స్కోర్లు చేయకుండా నిలువరించాడు. మొత్తానికి జట్టులో ఉంటూ టీమ్ ని ఉత్సాహపరుస్తూ తన వంతు సహాయ సహకారాలు అందించాడు.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×