BigTV English

NO Sugar: నెల రోజులు చక్కెర తినకపోతే.. ఇన్ని లాభాలా !

NO Sugar: నెల రోజులు చక్కెర తినకపోతే.. ఇన్ని లాభాలా !

NO Sugar: ఉప్పు, చక్కెర అధికంగా తీసుకోవడం మన శరీరానికి హానికరం అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో గుండె జబ్బులకు కూడా కారణం అవుతుంది. ఇదిలా ఉంటే మీరు అధికంగా చక్కెర కలిగిన ఆహార పదార్థాలను తింటే.. అది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అంతే కాకుండా బరువు పెరగడానికి కూడా కారణం అవుతుంది.


రక్తపోటు నియంత్రణలో ఉన్నప్పటికీ చక్కెరను తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారు చక్కెరను అస్సలు తినకూడదని సలహా ఇస్తున్నారు.

ఒక నెల పాటు చక్కెర తీసుకోవడం పూర్తిగా తగ్గించినా, ఆపివేసినా అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.


30 రోజుల నో షుగర్ ఛాలెంజ్ :
ఒక నెల పాటు మీ ఆహారంలో చక్కెర వాడకుండా ఉండటానికి మీరు సవాల్ గా తీసుకోవచ్చు. దీని ప్రధాన లక్ష్యం చక్కెర కలిపిన ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం. ఇలా చేస్తే బదులుగా, మీరు అదనపు చక్కెరలు లేని పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంపై దృష్టి పెడతారు.

కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తుల వంటి ఆహారాలలో లభించే సహజ చక్కెరలు శరీరానికి పెద్దగా హాని కలిగించవు. ఐస్ క్రీం, కుకీలు, కేక్, క్యాండీ, సోడా, కొన్ని రకాల డ్రింక్స్ లో చక్కెర కలుపుతారు. ఇది శరీరంపై అనేక రకాలుగా ప్రభావాన్ని చూపుతుంది.

నిజంగా చక్కెర మానేస్తే.. ప్రయోజనాలు ఉంటాయా ?
చక్కెర తగిన మోతాదులోనే తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అన్నింటిలో మొదటిది మీ చక్కెర స్థాయిని నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. డయాబెటిస్ వల్ల కలిగే సమస్యలను నివారించడంలో ఇది సహాయపడుతుంది.

బరువు తగ్గడం, ఇతర ప్రయోజనాలు: 
మీ ఆహారంలో చక్కెర వాడటం 30 రోజులు మానివేయడం వల్ల మీరు బరువు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రత్యేకంగా పోషకాలు అధికంగా ఉండే ఆహారంతో తిన్న సమయంలో మీరు చక్కెర తీసుకోవడం తగ్గించుకుంటే అద్భుత మైన ప్రయోజనాలు ఉంటాయి. ఇలా చేస్తే మీరు 30 రోజుల్లో మరింత ఫిట్‌గా ఉండగలుగుతారు.

అదనంగా చక్కెర కలిగిన ఆహార పదార్థాలతో పాటు డ్రింక్స్ ,ముఖ్యంగా ఫ్రక్టోజ్ అధికంగా ఉండే వాటిని తీసుకోవడం తగ్గించడం వల్ల కాలేయం నుండి కొవ్వును తగ్గించి, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని పలు అధ్యయనాల్లో రుజువైంది.

Also Read: వ్యాయామం చేయకుండానే ఫిట్‌గా ఉండాలంటే ?

చక్కెర తినకపోతే ఏమైన నష్టాలుంటాయా ?

మీరు రోజు సరైన పోషకాహారం తింటే మీ ఆహారంలో చక్కెరను తగ్గించడం వల్ల ఎటువంటి ప్రభావం ఉండదు. చక్కెర , కార్బోహైడ్రేట్ కలిగిన ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల మీరు డయాబెటిస్ బారిన పడే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది. 30 రోజుల నో షుగర్ ఛాలెంజ్ మీకు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మీరు షుగర్ తినని సమయంలో సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం పట్ల శ్రద్ధ వహించండి.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×