BigTV English
Advertisement

SKN: రఫా గురించి స్టార్ హీరోయిన్స్ పోస్టులు.. ఇండియా గురించి ఎప్పుడైనా పెట్టారా.. నిర్మాత సూటి ప్రశ్న

SKN: రఫా గురించి స్టార్ హీరోయిన్స్ పోస్టులు.. ఇండియా గురించి ఎప్పుడైనా పెట్టారా.. నిర్మాత సూటి ప్రశ్న

SKN: ఉదయం నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒకే ఒక్క పోస్ట్.. ఆల్ ఐస్ ఇన్ రఫా. స్టార్ హీరోయిన్లు.. బాలీవుడ్ , టాలీవుడ్, హోలీవుడ్ అని లేకుండా అందరూ తమ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఆల్ ఐస్ ఇన్ రఫా అంటూ పెట్టుకొచ్చారు. ఉదయం నుంచి అసలు ఇదెంతో తెలియని అభిమానులు, ఎందుకు పెడుతున్నారో అర్ధం కాకా బుర్రలు గోక్కుంటూన్నారు.


ఇక అసలు విషయం ఏంటంటే.. గత 9 నెలలుగా కొనసాగుతోన్న ఇజ్రాయేల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెల్సిందే. ఆ యుద్ధం ఇప్పుడు మరింత ఉద్రిక్తంగా సాగుతోంది. రఫాపై ఆదివారం రాత్రి నుంచి ఇజ్రాయేల్‌ భీకర దాడులుసాగిస్తోంది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా 45 మంది పాలస్తీనాలు ప్రాణాలు కోల్పోగా.. వందల మంది గాయపడ్డారు. సోమవారం, మంగళవారం మరో 37 మంది పాలస్తీనీయన్లు మృతి చెందారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ హృదయ విదారకమైన ఫోటోలు ప్రతి ఒక్కరి మనసును కలిచివేస్తున్నాయి.

ఇక ఈ ఫోటోలను సెలబ్రిటీలు షేర్ చేస్తూ.. ఆల్ ఐస్ ఇన్ రఫా అనే పోస్ట్ తో ఆ కాల్పులు ఆపాలని అభ్యర్ధిస్తున్నారు. సమంత,అలియా, సోనమ్, ప్రియాంక చోప్రా, శ్రీలీల, దియా మీర్జా, త్రిప్తి.. ఇలా స్టార్ హీరోయిన్స్ అందరూ ఈ పోస్ట్ ను షేర్ చేశారు. తాజాగా వీరందరికి నిర్మాత SKN సూటిగా ఒక ప్రశ్న వేశాడు. ఇండియాలో జరిగినప్పుడు ఇలాంటి పోస్ట్ నేను ఒక్కడి కూడా చూడలేదే అని సెటైర్ వేస్తూ ట్వీట్ చేశాడు.


” ఇన్‌స్టాలోని చాలా మంది సెలబ్రెటీలకు రఫాపై ఉన్న కంటెంట్ నిజంగా తెలుసా..? లేదా అందరూ ఒకే పోస్ట్‌ను షేర్ చేస్తున్నారా అని తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉంది. ఎందుకంటే నిజంగా భారతదేశం గురించి ఇంతమంది పోస్ట్ చేయడం ఎప్పుడూ చూడలేదు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మన దేశంలో ఉంటూ మన గురించి మాట్లాడితే.. ప్రభుత్వాలు ఏం చేస్తాయో తెలుసు.. అదే పరాయి దేశం గురించి మాట్లాడితే ఎవరు ఏమి అనరు అనే ధైర్యంతో చేస్తున్నారు అని కొందరు.. ఇదంతా పీఆర్ స్టంట్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×