BigTV English

SKN Reaction : తూచ్.. అది జోక్, నా వచ్చే సినిమాల్లో వాళ్లే ఉంటారు.. ఇదేం ట్విస్ట్ ఎస్‌కేఎన్

SKN Reaction : తూచ్.. అది జోక్, నా వచ్చే సినిమాల్లో వాళ్లే ఉంటారు.. ఇదేం ట్విస్ట్  ఎస్‌కేఎన్

SKN Reaction : శ్రీనివాస కుమారన్ అంటే అందరికీ తెలియకపోవచ్చు. కానీ ఎస్ కే ఎన్ అంటే తెలియని వాళ్ళు ఉండరు అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతగా ఈ మధ్య కాలంలో పాపులర్ అయ్యారు ఎస్ కే ఎన్. ఇంకా ఎస్ కే ఎన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాలు నిర్మించిన కూడా ఎస్ కే ఎన్ కి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన సినిమా అంటే టాక్సీవాలా అండ్ బేబీ అని చెప్పొచ్చు.


బేబీ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఒక సినిమాని నమ్మి కొన్ని కోట్లు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఒక దర్శకుడి ఆలోచన నమ్మి కొన్ని కోట్లు పెట్టడం అంటే దానిని సాహసం అనే చెప్పాలి. అయితే అలా సాయి రాజేష్ ఆలోచనను నమ్మి కొన్ని కోట్లు పెట్టి బేబీ సినిమాను నిర్మించారు. ఈ బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది.

ముందుగా ఈ సినిమా విషయంలో కొంతమంది నుంచి కొద్దిపాటి నెగిటివ్ ఫీడ్ బ్యాక్స్ వచ్చాయి. కానీ అవన్నీ కూడా రియల్ ఆడియన్స్ నుంచి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ తో డామినేట్ అయిపోయాయి. ఇకపోతే ఈ సినిమా ప్రీమియర్ పడగానే కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టామని చాలా నమ్మకంతో అప్పట్లో చెప్పుకొచ్చారు ఎస్ కే ఎన్. అక్కడితో ఎస్ కే ఎన్ బాగా ఫేమస్ అవుతూ వచ్చారు. అంతకంటే ముందు నుంచే కూడా ఎస్ కే ఎన్ స్టేజ్ పైన మాట్లాడిన తీరు, ట్విట్టర్లో ఫ్యాన్స్ కి ఇచ్చే రిప్లైస్ కూడా ఎస్ కే ఎన్ కి ఒక ఓన్ ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టాయి. ఇకపోతే ఏ సినిమా ఫంక్షన్ అయినా కూడా ఎస్ కే ఎన్ తన మాటలతో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు.


ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ అనే సినిమా ఈవెంట్లో ఎస్ కే ఎన్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. తెలుగు హీరోయిన్స్ కంటే కూడా తెలుగు రానివాళ్ళకే మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. తెలుగు హీరోయిన్స్ కి అవకాశం ఇస్తే ఏం జరుగుతుందో అనే అర్థం వచ్చేటట్లు ఎస్ కే ఎన్ మాట్లాడారు. దానిపైన పలు రకాల వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటన్నిటికీ ఎస్ కే ఎన్ రియాక్ట్ అయ్యారు. అది కేవలం జోక్ గా మాత్రమే తీసుకోండి. ఇప్పటివరకు నేను చాలామంది తెలుగు హీరోయిన్స్ ని పరిచయం చేశాను. నా రాబోయే సినిమాల్లో కూడా తెలుగు హీరోయిన్స్ మాత్రమే ఉంటారు. అంటూ ప్రస్తుతం చేస్తున్న మూడు ప్రాజెక్టులు ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు చెప్పుకొచ్చాడు నిర్మాత ఎస్ కే ఎన్.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×