BigTV English

Raja Saab: ఏంది మావా నిజమేనా.. ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి క్రేజీ అప్డేట్ అందించిన ప్రొడ్యూసర్..!

Raja Saab: ఏంది మావా నిజమేనా.. ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి క్రేజీ అప్డేట్ అందించిన ప్రొడ్యూసర్..!

Producer Tg Vishwaprasad Clarifies About Raja Saab Shooting: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత మరికొన్ని సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో రాజా సాబ్ ఒకటి. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. రాజాసాబ్ షూటింగ్ ఎంత మేర జరిగింది. ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందో నిర్మాత టిజి విశ్వప్రసాద్ తెలిపాడు. దానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..


ప్రభాస్ నటించిన కల్కి జూన్ 27న గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో ప్రభాస్ తన యాక్షన్ పెర్ఫార్మెన్స్‌తో సినీ ప్రియుల్ని ఉర్రూతలూగించాడు. ముఖ్యంగా దర్శకుడు నాగ్ అశ్విన్ తన క్రియేటివిటీతో సినిమా రేంజ్‌ను మరో ఎత్తుకు తీసుకెళ్లాడు. దాదాపు రూ.600 కోట్లతో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినిదత్ నిర్మించాడు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.1200 కోట్ల భారీ కలెక్షన్లను నమోదు చేసి అబ్బురపరచింది.

ఈ సినిమా ఘన విజయంతో ప్రభాస్ తన లైనప్‌లో ఉన్న సినిమాలను పట్టాలెక్కించాడు. అందులో దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో ‘రాజా సాబ్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు అందరిలోనూ క్యూరియాసిటీ పెంచేసాయి. అయితే ఇప్పటి వరకు ప్రభాస్ సలార్, కల్కి సినిమాల్లో ఫుల్ మాస్ అండ్ యాక్షన్ లుక్‌లో కనిపించి అందరినీ అలరించాడు.


Also Read: ‘రాజాసాబ్’ గ్లింప్స్ రిలీజ్.. ప్రభాస్ ఏమున్నాడురా బాబు

అయితే ఇప్పుడు రాజాసాబ్‌లో మాత్రం లవర్ బాయ్‌గా కనిపించబోతుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అదీగాక ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రభాస్ ఫస్ట్‌లుక్ గ్లింప్స్ అభిమానులు, ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందులో స్టైలిష్ లుక్‌తో కనిపించి అదరగొట్టేశాడు ప్రభాస్. అతడి స్వాగ్‌కు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ఇందులో ప్రభాస్‌కు జోడీగా మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమా నుంచి అప్డేట్‌ల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అదిరిపోయే అప్డేట్ అందించాడు. ఈ మేరకు ఈ సినిమా షూటింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రాజాసాబ్ షూటింగ్ ఆల్‌మోస్ట్ పూర్తయిపోయిందని అన్నాడు. ఈ ఏడాది ఆఖరుకల్లా షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నట్లు తెలిపాడు. మరోవైపు ప్రభాస్‌తో ఉన్న స్టిల్‌ను పంచుకుంటూ.. జాన్ త్వరలోనే వచ్చేందుకు రెడీగా ఉన్నాడు అని తెలిపాడు. ఇందులో భాగంగానే రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ వచ్చే ఏడాది జనవరిలో రాబోతున్నట్లు చిన్నపాటి హింట్ ఇచ్చాడు. ఈ అప్డేట్‌తో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×