BigTV English

Black Coffee Benefits: బ్లాక్ కాఫీతో 30 రోజుల్లోనే వెయిట్ లాస్.. ఎలానో తెలుసా ?

Black Coffee Benefits: బ్లాక్ కాఫీతో 30 రోజుల్లోనే వెయిట్ లాస్.. ఎలానో తెలుసా ?

Black Coffee Benefits: మనలో చాలా మందికి ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా బ్లాక్ కాఫీ తాగేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. బ్లాక్ కాఫీ కేవలం మంచి రుచి సువాసన మాత్రమే కలిగి ఉంటుందని అనుకుంటే పొరపాటే. బ్లాక్ కాఫీ మిమ్మల్ని రిలాక్స్ చేసేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా మెదడు సామర్థ్యాన్ని పెంచేందుకు ఎంతగానో తోడ్పడతాయి.


ఇవే కాకుండా రోజు ఉదయాన్నే బ్లాక్ కాఫీ మిస్ అవ్వకుండా తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

యాంటీ ఆక్సిడెంట్: క్లోరోజెనిక్, యాసిడ్, మోలనోయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు బ్లాక్ కాఫీలో ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీరంలో హానికరమైన ఫ్రీరాడికల్స్ ను తటస్థం చేయడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చేస్తుంది. రోజూ ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.


కాంగ్నిటివ్ ఫంక్షన్: బ్లాక్ కాఫీ వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇది మానసిక ప్రశాంతతను కోరుకునే వారికి మంచి డ్రింక్ అని చెప్పవచ్చు. ఇందులో కెఫైన్ మెదడుకు సహజమైన రిలాక్సేషన్ అందిస్తుంది. అంతే కాకుండా అడినోసౌన్ న్యూరోటాన్సిమిటర్‌ను అడ్డుకుని నోర్‌పైన్ ఫ్రైన్ వంటి ఫీల్ గుడ్ న్యూరోట్రాన్స్మిటర్లను విడుదల చేస్తుంది. ఇది మీ మూడ్‌ను మరింత ఉత్సాహ పరిచేందుకు సహాయపడుతుంది. అంతే కాకుండా పనులపై మీ ఫోకస్ పెంచి మెదడును మరింత చురుగ్గా ఉంచేందుకు సహాయపడుతుంది.

బరువు నియంత్రణ: కాఫీ తాగడం వల్ల కేవలం కేవలం 30 రోజుల్లోనే మన బరువులో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారికి వెయిట్ లాస్ సీక్రెట్ గా ఇది పనిచేస్తుంది. కాఫీలోని కెఫైన్ మీ జీర్ణక్రియను పెంచడమే కాకుండా రోజంతా ఎక్కువ క్యాలరీలు కరిగించడంలో కూడా సహాయపడుతుంది. అంతే కాకుండా మీ డైట్ ప్లాన్‌‌కు తగ్గట్టుగా సహజమైన ఆకలిని అణచివేసి అదనపు క్యాలరీలకు కూడా దూరంగా ఉంచుతుంది . ఫలితంగా మీరు సమతుల్య ఆహారం తీసుకొని బరువును నియంత్రించుకోగలుగుతారు. 30 రోజులు రెగ్యులర్‌గా కాఫీ తాగడం వల్ల మీ బరువులో కచ్చితమైన మార్పు చూడవచ్చు.

శారీరక పనితీరు: రోజంతా బిజీ బిజీగా గడపాల్సి ఉన్నా గాని ఒక కాఫీ తాగి బయటకు వెళ్లడం మంచిది. శారీరక పనితీరుకు అవసరమైన ప్రోత్సాహాన్ని కాఫీ అందిస్తుంది. కాఫీ రక్తంలోని అడ్రినలిన్ స్థాయిలను పెంచుతుందని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఇది కొవ్వు కణజాలం నుంచి ఫ్యాటీ యాసిడ్లను సమీకరించి శరీరానికి కావాల్సిన శక్తి వినియోగానికి సహాయపడుతుంది. రోజు వ్యాయామం చేసేవారు ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగి బయలు దేరడం వల్ల ఎక్కువ క్యాలరీలు తగ్గించుకోవచ్చు.

Also Read: స్నానం చేసే నీళ్లలో ఒక్కసారి ఇది కలిపి చేయండి.. ఇక అస్సలు వదలలేరు..

కాలేయ ఆరోగ్యం: కాలేయం శరీర నిర్విషీకరణకు పోషకాలు నిండిన జీవక్రియకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిని ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం . రోజు ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగడం వల్ల కాలేయ క్యాన్సర్ వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. వాస్తవానికి కాఫీ తాగని వారితో పోలిస్తే క్రమం తప్పకుండా కాఫీ తాగేవారిలో కాలేయ వ్యాధి ప్రమాదాలు 80% వరకు తగ్గాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగే అలవాటు చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×