Propose Day 2025: ఫిబ్రవరి అంటే లవర్స్ కు వెరీ స్పెషల్ అని తెలిసిందే.. ఎందుకంటే ఈ నెలలో వాలంటైన్స్ డే ఉంటుంది. ఈ రోజున ప్రేమికులు తన పార్ట్నర్ కు ప్రత్యేకంగా ప్రపోజ్ చేసి, తమ ప్రేమను తెలియపరుస్తారు. ఈరోజు కన్నా ముందు కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి. ఫిబ్రవరి 7 నుంచి ప్రేమికుల వారాన్ని ప్లాన్ చేసుకుంటున్న లవర్స్. 7న రోజ్ డే, 8న ప్రపోజ్ డే, 9న చాక్లె్ట్ డే, 10న టెడ్డీ డే, 11న ప్రామిస్ డే, 12న హగ్ డే, 13న కిస్ డే, 14 న ప్రేమికుల రోజు.. ఈరోజు ప్రపోజ్ డే సందర్బంగా సినిమాల్లో బెస్ట్ గా నిలిచిన ప్రపోజల్ సీన్స్ ఏ సినిమాల్లో ఉన్నాయో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం..
ఓయ్..
వాలెంటైన్స్ డే అంటే చాలామంది ప్రేమికులకు ఓయ్ సినిమానే గుర్తొస్తుంది. లవర్ బాయ్ సిద్ధార్థ్ బేబీ షామిలి జంటగా నటించిన ఈ మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకుంది. లవర్స్ ని బాగా ఆకట్టుకుందని చెప్పాలి. ఈ మూవీలో హీరో హీరోయిన్ ని ప్రపోజ్ చేసే సీను ఇప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తుంది. తను చనిపోతుందని తెలిసినా కూడా తనకు తన మనసులోని ప్రేమను ప్రపోజ్ చేస్తాడు. అందులో భాగంగా 12 నెలలకు సరిపోయేటట్టు 12 గిఫ్ట్లు ఇచ్చి హీరోయిన్ ప్రపోష్ చేస్తాడు హీరో. ఆ సీన్ మాత్రం సినిమాకు బాగా హైలైట్ అయింది చాలామంది ఆ సీన్ నీకు కాపీ కొట్టి తమ లవర్స్ కి అంకితం చేసేలా గిఫ్ట్లు ఇచ్చి పడగొట్టేస్తున్నారు.
మిర్చి..
ఇప్పుడు ప్రభాస్ యాక్షన్ సినిమాలో చేస్తున్నాడు కానీ ఒకప్పుడు లవర్ బాయ్ గా అమ్మాయిల మనసులో చోటు సంపాదించుకున్నాడు. డార్లింగ్ మిర్చి వంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. ముఖ్యంగా మిర్చి సినిమాలో అనుష్కకు ప్రభాస్ ప్రపోజ్ చేసే సీన్ మాత్రం హైలెట్ అనే చెప్పాలి. ఛాన్స్ ఇస్తావా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అన్న సీన్ యూత్ ని బాగా ఆకట్టుకుంది..
ఏం మాయ చేసావే…
నాగచైతన్య సమంత నటించిన సినిమా ఏ మాయ చేసావే.. ఈ మూవీ తోని వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు కూడా అయితే ఈ సినిమాలో హైలెట్ సీనుగా ఒకటి ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా ఇప్పటి నుంచి నా సిస్టర్సే. ఒక్క నువ్వు తప్ప.. అని హీరో అంటే దానికి హీరోయిన్ ఎందుకు అని అడుగుతుంది. ఎందుకంటే నేను నీతో ప్రేమలో ఉన్నా జెస్సీ అంటూ చెప్పేస్తాడు కార్తీక్. నడుచుకుంటూనే క్యూట్‍గా, హఠాత్తుగా మాటల్లోనే ప్రపోజ్ చేసేస్తాడు.. ఆ సీన్ యూత్ ను ఫిదా చేసింది.
ఇక వీటితో పాటు ఊహలు గుసగుసలాడే, జాతి రత్నాలు సినిమాల్లో కూడా ప్రపోజల్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమాలు హిట్ అయిన కూడా ఆ సీన్స్ మాత్రం ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఇప్పటికీ లవర్స్ డే కి ఆ సీన్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. నేడు ప్రపోజల్ డే సందర్భంగా ఆ సీన్స్ ని మరొకసారి చూసేయండి..