BigTV English

NTR Hrithik Roshan War: ఎన్టీఆర్ కోసం హృతిక్ వెయిటింగ్.. వార్ వాయిదా!

NTR Hrithik Roshan War: ఎన్టీఆర్ కోసం హృతిక్ వెయిటింగ్.. వార్ వాయిదా!

NTR Hrithik Roshan War movie update(Cinema news in telugu): బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్ భారీ బడ్జెట్ మూవీ ‘వార్ 2’. 2019లో వచ్చిన వార్ సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమాకు బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. హీరో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి.


ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెండు ముంబై షెడ్యూల్స్ లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. మరో యాక్షన్ సీక్వెన్స్ కోసం డైరెక్టర్ అయాన్ ముఖర్జీ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేశాడు. ఈ యాక్షన్ షెడ్యూల్ చిత్రీకరించడంలో చాలా సమయం పడుతుందని సమాచారం. ఈ షెడ్యూల్ ఆగస్టు 20న ప్రారంభం కానుండగా.. ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొనపోవడంతో వాయిదా పడింది. ప్రస్తుతం ఎన్టీఆర్ విదేశాల్లో కుటుంబంతో పాటు హాలిడేకు వెళ్లాడు.

Also Read: ఐకానిక్‌ పాత్రకు మహేశ్‌ డబ్బింగ్‌.. తెలుగు ట్రైలర్‌ ఎప్పుడంటే!


ఎన్టీఆర్ సినిమాలో పాల్గొనకపోవడానికి ముఖ్యకారణం చేతికి గాయం కావడం. ఎన్టీఆర్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కుటుంబంతో పాటు విదేశాలకు వెళ్లేందుకు వచ్చినప్పుడు అతని చేతికి కట్టు కూడా కనిపించింది. చేతికి గాయం కావడం వల్ల హృతిక్ రోషన్ తో షూట్ చేయాల్సిన సన్నివేశాలు వాయిదా పడ్డాయి. చేతి గాయం పూర్తిగా నయమయ్యేందకు కనీసం 10 రోజులు పడతుందని.. ఈ లోపు కుటుంబంతో సరదా గడిపేందుకు ఎన్టీఆర్ విదేశాలకు బయలుదేరాడు.

Also Read:  సంక్రాంతి బరిలో బాలకృష్ణ సినిమా.. మరోసారి చిరుతో పోటీ!

అంతకుముందు ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న తెలుగు చిత్రం దేవర. ఇటీవలే ఎన్టీఆర్ ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేశాడు. దేవర్ షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ చేతికి గాయం కాగా.. ఆ నొప్పి భరిస్తూనే ఎన్టీఆర్ తన పాత్రకు సంబంధించి అన్ని సన్నివేశాలు పూర్తి చేశాడు. దేవర చిత్రం రెండు భాగాల్లో విడుదల కాబోతోంది. మొదటి భాగం దేవర-1 సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా కేజీఎఫ్ తరహాలో మరో చిత్రం షూటింగ్ దసరా సమయంలో ప్రారంభం కానుంది.

Also Read: ‘బిగ్ బాస్ సీజన్ 8’ డేట్ ఫిక్స్.. అన్‌లిమిటెడ్ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌!

మరోవైపు యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై పఠాన్, ఏక్ ఠా టైగర్ చిత్రాల స్పై థ్రిల్లర్ యూనివర్స్ లో భాగం గా రూపొందుతున్న ‘వార్ 2’ చిత్రంలో హృతిక్ రోషన్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా.. మరో ముఖ్య పాత్రలో జాన్ అబ్రహం కనిపించబోతున్నాడు.  ఎన్టీఆర్ కోసం హృతిక్ రోషన్ తోపాటు చిత్ర యూనిట్ మొత్తం వెయిట్ చేస్తోంది. ఎన్టీఆర్ రాగానే కొత్త షెడ్యూల్ ప్రారంభవుతుందని సమాచారం.

Also Read: సినీ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులు.. ‘కొత్త చట్టం తీసుకురావాలి’

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×