Pawan Kalyan New Movie : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కేవలం క్రేజ్ మాత్రమే కాకుండా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని పేరు ఉన్న హీరో పవన్ కళ్యాణ్. పలు సందర్భాలలో జానీ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత చాలామంది డిస్ట్రిబ్యూటర్లను పిలిచి పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చాడు అనే వార్తలు వినిపిస్తూ వచ్చాయి. కొంతమంది నిర్మాతలు కూడా దీని గురించి బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి నష్ట బోయిన నిర్మాతలకు ఇంకో సినిమా ఇవ్వడం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. బండ్ల గణేష్ నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా తీన్మార్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని సక్సెస్ సాధించలేకపోయింది.
బండ్ల గణేష్ కు మరో అవకాశం
తీన్మార్ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత ” నిన్ను మార్కెట్లోకి మామూలు ప్రొడ్యూసర్ గా వదలను” అంటూ పవన్ కళ్యాణ్ చేసుకోవలసిన గబ్బర్ సింగ్ సినిమాకు నిర్మాతగా అవకాశం బండ్ల గణేష్ కు అందించాడు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అన్ని సినిమాల రికార్డ్స్ ను కొల్లగొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో విపరీతమైన జోష్ నింపింది. ఆ సినిమా తర్వాత హరీష్ శంకర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు మరో నిర్మాతకు కూడా అలానే అవకాశం ఇవ్వనన్నట్లు తెలుస్తుంది.
రత్నం – పూరి జగన్నాథ్ – పవన్ కళ్యాణ్
ఏఎం రత్నం నిర్మాతగా హరిహర వీరమల్లు అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు. సినిమా హిట్ అవుతుందని నమ్మకం కూడా చాలామందికి లేదు అనేది వాస్తవం అయితే ఒకవేళ ఈ సినిమా ఫలితం తేడా కొడితే వెంటనే నిర్మాత రత్నంకు పవన్ కళ్యాణ్ మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాను దర్శకుడు పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసే అవకాశం. ఒకవేళ పూరి పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే మూడవ సినిమా ఇది. పూరిని దర్శకుడుగా ఎంచుకోవడానికి కారణం సినిమాను అతి త్వరగా ఫినిష్ చేస్తాడు అనే పేరు ఉండడం. ప్రస్తుతానికి పూరికి కూడా పెద్దగా కమిట్మెంట్స్ లేవు కాబట్టి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ తో మళ్ళీ సినిమా చేస్తే పూరీ రేంజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. దీని గురించి అధికారకు ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
Also Read: Am Ratnam: నేను ఎప్పుడూ మనీ మైండ్ గా సినిమా చెయ్యను