India’s First AC Coach Train: ప్రస్తుతం భారతీయ రైల్వే నెట్ వర్క్ అత్యాధునిక హంగులను అద్దుకుంది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో సెమీ హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ రైళ్లు పూర్తిగా ఏసీతో కవర్ చేయడంతో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తున్నాయి. అయితే, దేశంలో తొలి ఏసీ రైలు ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందో తెలుసా? ఇంతకీ అప్పట్లో బోగీలు చల్లగా ఉండేందుకు ఏం చేసే వారంటే..
1934లో అందుబాటులోకి తొలి ఏసీ రైలు
భారత్ లో రైల్వే వ్యవస్థను ఆంగ్లేయులు అందుబాటులోకి తీసుకొచ్చారు. 1928 సెప్టెంబర్ 1న తొలి రైలును ప్రారంభించారు. ఆ రైలు పేరు ఫ్రాంటియర్ మెయిల్. ఈ రైలుకు 1934లో తొలిసారి ఏసీ కోచ్ ను యాడ్ చేశారు. అప్పట్లో ఏసీలు అందుబాటులో లేని కారణంగా, కోచ్ లు చల్లగా ఉండేందుకు ఐస్ బ్లాక్ లను ఉపయోగించేవారు. ఏసీ కోచ్ కింద ఉన్న పెట్టెలో ఐస్ బ్లాక్స్ పెట్టారు. అక్కడ ఓ ఫ్యాన్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాన్ నుంచి వచ్చే గాలి ఐస్ కు తగిలి కోచ్ చల్లగా ఉండేది. ఐస్ కరిగిపోతే, నెక్ట్స్ స్టేషన్ లో మళ్లీ ఐస్ బ్లాక్స్ పెట్టే వాళ్లు. అలా ఏసీ కోచ్ ను అందుబాటులోకి తెచ్చారు ఆంగ్లేయులు.
అప్పట్లోనే క్లాసులుగా విభజన
ఇక ఫ్రాంటియర్ మెయిల్ లో అప్పట్లోనే ఫస్ట్ క్లాస్, సెకెండ్ క్లాస్ లుగా ఏర్పాటు చేశారు ఆంగ్లేయులు. ఫస్ట్ క్లాస్ లో బ్రిటీష్ వారు మాత్రమే ప్రయాణించాలనే రూల్ ఉండేది. ఈ నేపథ్యంలో వారి బోగీ చల్లగా ఉండేందుకు ఐస్ బ్లాక్స్ ఏర్పాటు చేసే వాళ్లు. ఈ రైలు 1928 సెప్టెంబర్ 1న ముంబైలోని బల్లార్డ్ పీర్ స్టేషన్ నుంచి ఢిల్లీ, బటిండా, ఫిరోజ్ పూర్, లాహోర్ మీదుగా పెషావర్ వరకు వెళ్లింది. ఆ తర్వాత మార్చి 1930లో సహరాన్ పూర్, అంబాలా, అమృత్ సర్, లాహోర్ కు నడిపించారు.
Read Also: రైలులో ఏ కోచ్ ఎక్కడ ఉండాలో ఎలా నిర్ణయిస్తారు? ఎవరు నిర్ణయిస్తారో తెలుసా?
ఆంగ్లేయుల కాలంలో అత్యంత విలాసవంతమైన రైలు
ఫ్రాంటియర్ మెయిల్ రైలు ఆంగ్లేయుల కాలంలో అత్యంత విలాసవంతమైన రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో ఈ రైలు ఆవిరి సాయంతో గంటకు 60 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించేది. 1996లో తర్వాత ఈ రైలుకు గోల్డెన్ టెంపుల్ మెయిల్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ రైలు పవర్ తో నడుస్తున్నది. ముంబై నుంచి అమృత్ సర్ వరకు 1,893 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. మొత్తం 25 కోచ్ లను కలిగి ఉన్న ఈ రైలు 35 రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు దాదాపు 95 ఏండ్లుగా సేవలు అందిస్తున్నది. ఈ రైల్లో ఇన్ బిల్ట్ క్యాటరింగ్ సర్వీస్ ఉంది. ఇందుకోసం అదనపు ప్యాంట్రీ కార్ ను యాడ్ చేశారు. ప్రయాణీకులకు అవసరమైన ఫుడ్ అందిస్తారు.
Read Also: జనవరి 1 నుంచి మారనున్న రైల్వే టైమ్ టేబుల్.. వెంటనే చెక్ చేసుకోండి!