BigTV English

Pushpa 2 : ఒక్క పాటకు అన్ని నెలలు పట్టిందా?

Pushpa 2 : ఒక్క పాటకు అన్ని నెలలు పట్టిందా?

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ‘పుష్ప-2’ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ అవుతుందని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సినీ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది.


ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్లో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ ముందుగా ప్లాన్ చేసిన షెడ్యూల్ ప్రకారం.. షూటింగ్‌ను పూర్తి చేయలేకపోతున్నట్లు సమాచారం. అయితే ఈ షూటింగ్ ఆలస్యం కావడానికి జాతర సాంగ్ కారణం అని తెలుస్తోంది. ఈ మూవీలో కీలకమైన జాతర సాంగ్ సీక్వెన్స్‌కు సంబంధించిన షూటింగ్‌ చాలా రోజులుగా జరుగుతోందట. ఈ సాంగ్‌ను పూర్తి చేయడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టిందని అంటున్నారు. దీని కారణంగానే షూటింగ్ ఆలస్యం అయిందని టాక్ వినిపిస్తోంది.

అంతేకాకుండా ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించి సగం షూటింగ్ మాత్రమే పూర్తియిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ మూవీ ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్టు 15న రిలీజ్ అవుతుందా? లేదా అని సందేహాలకు దారి తీసింది. మరోవైపు ఈ సినిమాలో కేశవ పాత్ర పోషిస్తున్న నటుడు జగదీష్ ఇటీవల అరెస్ట్ అయ్యాడు. దీంతో ఈ పరిస్థితి మరింత చేజారిందని అంటున్నారు. ఇది షూటింగ్ ఆలస్యం కావడానికి మరో కారణమని సినీ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.


Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×