BigTV English

Nordic countries : గడ్డకట్టిన స్వీడన్‌.. మంచులోనే 1000 వాహనాలు..

Nordic countries : గడ్డకట్టిన స్వీడన్‌.. మంచులోనే 1000 వాహనాలు..

Nordic countries : మంచు కారణంగా స్వీడన్‌లో వెయ్యికి పైగా వాహనాలు జాతీయరహదారిపై నిలిచిపోయాయి. దీంతో యూరోపియన్ హైవేల్లో అత్యంత పొడవైన E22 రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దక్షిణ స్వీడన్‌లోని స్కోనా రీజియన్‌లో E22 రహదారిపై పెద్ద ఎత్తున కార్లు, ట్రక్కులు మంచులో చిక్కుకుపోయాయి. హార్బీ-క్రిషన్‌స్టాడ్ మధ్య వాహనాలు ఎటుూ కదల్లేని విధంగా నిలిచిపోయాయి.


మంచులో గజగజలాడుతున్న వాహనదారులకు స్వీడన్ సాయుధ దళాలు ఆహారం, నీరు అందిస్తున్నాయి. వారిని రెస్క్యూ బృందాలు అక్కడ నుంచి తరలిస్తున్నాయి. వారి వాహనాలను తర్వాత అందజేస్తామని అధికారులు ప్రకటించారు. నార్డిక్ దేశాల్లో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ఠం కన్నా దిగువకు పడిపోతున్నాయి.

స్వీడన్, ఫిన్లాండ్, నార్వేల్లో తీవ్ర శీతల పరిస్థితులు నెలకొన్నాయి. డెన్మార్క్‌లో మంచు తుఫాను కురుస్తోంది. బుధవారం నుంచి డ్రైవర్లు ఆ మంచు తుఫానులో చిక్కుకుపోయారు. ఉత్తర స్వీడన్‌లో అయితే గడ్డ కట్టుకుపోయింది. గత 25 ఏళ్లలో ఎన్నడూ చవిచూడనంతగా ఉష్ణోగ్రతలు మైనస్ 43.6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది.


బుధవారం సాయంత్రం నుంచి రహదారిపై మంచును తొలగించే వాహనాలతో అధికారులు బిజీగా ఉన్నారు. గురువారం ఉదయానికి చాలా కార్లను క్లియర్ చేయగలిగారు. శుక్రవారం నాటికి కానీ మంచు తొలగించే ప్రక్రియ పూర్తి కాదని, అప్పటివరకు వాహనాలకు కదలిక ఉండదని అధికారులు చెబుతున్నారు.

Tags

Related News

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Big Stories

×