Pushapa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప ది రూల్ (Pushpa The Rule). ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ పేరు ప్రఖ్యాతలు కూడా పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోయాయి. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.
సత్తా చాటిన అల్లు అర్జున్…
ఇలా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాకు ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. అయితే ఈ సినిమాకు మించి పుష్ప 2 చిత్రాన్ని సుకుమార్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇకపోతే ఈ సినిమా కూడా అన్ని భాషలలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. కేవలం థియేటర్లలో మాత్రమే కాకుండా ఈ చిత్రం ఇటు డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్ కు కేవలం దక్షిణాది రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
టెలివిజన్ ప్రీమియర్..
అల్లు అర్జున్ ఈ సినిమాతో ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా ఫేవరెట్ హీరోగా మారిపోయారు. ఇలా పుష్ప 2 సినిమాతో ఎన్నో సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ తాజాగా మరొక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. సాధారణంగా తెలుగు హీరోలు నటించిన సినిమాలు బాలీవుడ్ థియేటర్లలో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ టెలివిజన్ ప్రీమియర్ అయినప్పుడు మాత్రం పెద్దగా ఆ సినిమాలను చూడటానికి ఆసక్తి చూపించరు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా టెలివిజన్ ప్రీమియర్ లో కూడా అద్భుతమైన రేటింగ్ కైవసం చేసుకుందని చెప్పాలి.
#Pushpa2TheRule (Hindi) has a record breaking viewership with 5.1 TVR with a massive reach of 5.4 CRORES 💥#AlluArjun #Sukumar #Rashmika pic.twitter.com/8fjQvMfGbY
— TeluguOne (@Theteluguone) June 14, 2025
తాజాగా ఈ సినిమా హిందీ వర్షన్ లో టెలివిజన్ ప్రీమియర్ అయింది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూస్ రావడమే కాకుండా ఏకంగా 5.1 టీవీఆర్ (టెలివిజన్ రేటింగ్ పాయింట్) సొంతం చేసుకుని అదేవిధంగా.5.4 కోట్ల రీచ్ కలిగి ఉండటం విశేషం. ఇలా హిందీలో టెలివిజన్ ప్రీమియర్ అయిన పుష్ప సినిమాకు ఈ స్థాయిలో ఆదరణ రావడం విశేషం. ఇలా సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఏ హీరో సినిమా విషయంలో కూడా ఇలా జరగడంలేదని, అల్లు అర్జున్ సినిమాకి ఇలాంటి రేటింగ్స్ సొంతమయ్యాయని చెప్పాలి. ఈ సినిమా విడుదలై కొన్ని నెలలు అవుతున్నప్పటికీ ఇంకా సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని చెప్పాలి. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అవడంతో అల్లు అర్జున్ తదుపరి సినిమాలపై అందరిలో కూడా ఎంతో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.