BigTV English

Uber Rapido: జూన్ 16 నుంచి ఉబెర్, ర్యాపిడోలు బంద్.. ఇప్పుడెలా బ్రో?

Uber Rapido: జూన్ 16 నుంచి ఉబెర్, ర్యాపిడోలు బంద్.. ఇప్పుడెలా బ్రో?

ఉబెర్ లేని నగరం, ర్యాపిడో లేని రోడ్లని మనం ఊహించగలమా..? కానీ తప్పదు, ఆ సర్వీసులపై ప్రభుత్వం నిషేధం విధించింది. జూన్ 16నుంచి ఉబెర్, ర్యాపిడో సర్వీసుల్ని బుక్ చేయడం కుదరదు. కుదరదంటే ఎలా, ఉన్నఫళంగా ఈ నిషేధం ఏంటి అనుకుంటున్నారా..? అయితే పూర్తి వివరాలు చూడండి.


ఉబెర్, ర్యాపిడోలు లేకపోతే ఆఫీస్ లకు ఎలా వెళ్లాలి? తెలియని చోట్ల అడ్రస్ వెదుక్కుని ఎలా చేరుకోవాలి? అని ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు వివరంగా తెలుసుకోండి.

క్లారిటీ నెంబర్ 1
ఉబెర్, ర్యాపిడోలకు చెందిన బైక్ ట్యాక్సీలపై మాత్రమే నిషేధం అమలులోకి వస్తోంది.


క్లారిటీ నెంబర్ 2
ఈ ఆంక్షలు కేవలం కర్నాటకలో మాత్రమే అమలులో ఉంటాయి. మిగతా నగరాల్లో ఎలాంటి ఆంక్షలు లేవు.

ఉబర్, ర్యాపిడో సర్వీస్ లు సామాన్యులకు, మధ్యతరగతి వారికి బాగానే ఉపయోగపడుతున్నాయి. అందులో అనుమానమేం లేదు. అయితే బైక్ ట్యాక్సీలతోనే సమస్య అంతా. ఈ బైక్ ట్యాక్సీల వల్ల అటు ఆటోలు, కార్ సర్వీస్ లపై ప్రభావం తీవ్రంగా పడుతోంది. గతంలో ఆటోల్లో వెళ్లేవారు ఇప్పుడు బైక్ ట్యాక్సీలను ఎంచుకుంటున్నారు. అందులోనూ బెంగళూరు వంటి ట్రాఫిక్ నగరాల్లో ఈ బైక్ ట్యాక్సీలు ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయి. దీంతో ఎవరూ ఆటోల జోలికి వెళ్లడం లేదు. అందుకే ఆటోవాలాలు ఆందోళన చేపట్టారు.

రవాణా శాఖ ఉత్తర్వులు..
ట్యాక్సీ సర్వీస్ ల కోసం, అంటే డబ్బులు తీసుకుని ప్రయాణికుల్ని ఎక్కించుకోడానికి బైక్ లు పనికిరావు అని కర్నాటక రవాణా శాఖ స్పష్టం చేసింది. అవి కేవలం వ్యక్తిగత ప్రయాణానికి మాత్రమేనని తేల్చి చెప్పింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా బైక్ ట్యాక్సీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 16నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుంది. దీనిపై ఆ రాష్ట్ర హైకోర్టు కూడా జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో నిషేధం కచ్చితంగా అమలులోకి వస్తుందని తేలిపోయింది.

బైక్ ట్యాక్సీ ఆపరేటింగ్ సంస్థలైన ర్యాపిడో, ఉబెర్ ఈ నిషేధంపై ఇటీవల కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. అయితే నిషేధాన్ని నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. వాణిజ్య ప్రయాణీకుల రవాణా కోసం ఉపయోగించే ద్విచక్ర వాహనాలు, రవాణా నిబంధనలకు విరుద్ధం అని కర్నాటక రవాణా శాఖ కోర్టుకి స్పష్టం చేసింది. గతంలో రాష్ట్ర రవాణా శాఖ ఉబెర్, ర్యాపిడోకి నోటీసులు జారీ చేసింది. వాణిజ్యపరంగా నమోదు చేయబడినవి, సరైన పర్మిట్లు ఉన్న వాహనాలను మాత్రమే అద్దెకు ప్రయాణీకులను తీసుకెళ్లడానికి రవాణా శాఖ నిబంధనలు అనుమతిస్తున్నాయని చెప్పింది. ప్రజా రవాణాకోసం బైక్ లు ఉపయోగించకూడదని స్పష్టం చేసింది.

ఉబెర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఆటోవాలాలకు, కార్ ట్రావెల్ ఆపరేటర్లకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. అదేసమయంలో బైక్ ట్యాక్సీల ద్వారా సమయాన్ని, డబ్బుని ఆదా చేసుకుంటున్న కొంతమంది ఉద్యోగులకు ఇది ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సోషల్ మీడియాలో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. బైట్ ట్యాక్సీల వల్ల ఎలాంటి నష్టం లేదని, ఇది కూడా కొంతమందికి ఉపాధి కల్పిస్తుందని వారు చెబుతున్నారు. బైక్ ట్యాక్సీలపై నిషేధాన్ని ఎత్తివేయాలని వారు కోరుతున్నారు.

Related News

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Train Travel: రైలు ప్రయాణీకులకు ఇన్ని రైట్స్ ఉంటాయా? అస్సలూ ఊహించి ఉండరు!

Big Stories

×