BigTV English

OTT Movie : చేయని నేరానికి 27 ఏళ్ల జైలు … డ్రగ్ మాఫియాకి చుక్కలు చూపించే లాయర్ … దుమ్ము దులుపుతున్న యాక్షన్ థ్రిల్లర్

OTT Movie : చేయని నేరానికి 27 ఏళ్ల జైలు … డ్రగ్ మాఫియాకి చుక్కలు చూపించే లాయర్ … దుమ్ము దులుపుతున్న యాక్షన్ థ్రిల్లర్

OTT Movie : ఒక వర్షం కురిసిన రాత్రి హాంకాంగ్ నగర వీధుల్లో మా కా-కిట్ అనే యువకుడు భయంతో పరిగెడుతుంటాడు. అకస్మాత్తుగా పోలీసు సైరన్లు కూడా మోగుతాయి. అతని చేతిలో ఒక కొకైన్ ప్యాకెట్ ఉండటంతో అతన్ని పోలీసులు పట్టుకుంటారు. కానీ అతను అమాయకుడని కేకలు వేస్తాడు. కోర్టులో అతని న్యాయవాదులు నేరాన్ని ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుందని చెప్తారు. నేరం ఒప్పుకున్నా కూడా అతనికి 27 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. ఈ కేసును ఒక ప్రాసిక్యూటర్ అయిన ఫోక్ చి-హో దర్యాప్తు చేయడాని వస్తాడు. దీనివెనుక ప్రమాదకరమైన మాఫియా శక్తులు ఉన్నాయని తెలుసుకుంటాడు. ఇంతకీ ఈ కేసు వెనుక దాగిన నిజం ఏమిటి ? న్యాయం కోసం ఫోక్ పోరాడగలడా, అతను కూడా కుట్రలో చిక్కుకుంటాడా ? ఈ సినిమా పేరు, ఎందులో వుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

2016 లో హాంకాంగ్‌లో జరిగిన నిజమైన డ్రగ్ ట్రాఫికింగ్ కేసు ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ స్టోరీ మా కా-కిట్ అనే పేద యువకుడితో మొదలవుతుంది. అతను అదనపు డబ్బు సంపాదించడానికి తన ఇంటి చిరునామాను అద్దెకు ఇస్తాడు. కానీ అతనికి తెలియకుండానే, ఆ చిరునామాకు ఒక కిలో కొకైన్ ప్యాకెట్ డెలివరీ అవుతుంది. అతను డ్రగ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అవుతాడు. అతని న్యాయవాది లీ స్జె-మాన్, లీగల్ ఎగ్జిక్యూటివ్ ఔ పాక్-మాన్ అతన్ని నేరాన్ని ఒప్పుకోమని ఒత్తిడి చేస్తారు. అలా చేస్తే శిక్ష తగ్గుతుందని చెప్తారు. కానీ కోర్టు అతనికి 27 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తుంది. దీని వల్ల అతని తాత ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆ తరువాత ఈ కేసును ఫోక్ చి-హో అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ విచారిస్తాడు. ఫోక్‌కు ఈ కేసులో ఏదో తప్పు ఉందని అనుమానం కలుగుతుంది. అతను ఈ కేసును సొంతంగా దర్యాప్తు ప్రారంభిస్తాడు.


ఫోక్ చి-హో ఈ కేసు వెనుక దాగిన నిజాన్ని కనుగొనడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌లోని అడ్డంకులను ఎదుర్కొంటాడు. అతని దర్యాప్తు అతన్ని హాంకాంగ్ క్రిమినల్ అండర్‌వరల్డ్‌లోకి తీసుకెళ్తుంది. అక్కడ ఒక డ్రగ్ ట్రాఫికింగ్ సిండికేట్ ను ఎదుర్కుంటాడు. ఫోక్‌కు ఈ కేసు కేవలం ఒక నేరం కాదని, లీగల్ సిస్టమ్‌లో లోతుగా పాతుకుపోయిన కుట్ర అని అర్థమవుతుంది. అతను సాక్ష్యాలను సేకరిస్తూ, కోర్టు గదిలో వాదిస్తూ, హాంకాంగ్ వీధుల్లో శత్రువులతో ఫైట్ చేస్తాడు. సినిమా ఒక అద్భుతమైన ఓపెనింగ్ యాక్షన్ సీన్‌తో మొదలవుతుంది. ఫోక్ దర్యాప్తు లోతుగా వెళ్లే కొద్దీ, అతను తన కెరీర్ ని కూడా పణంగా పెడతాడు. డ్రగ్ సిండికేట్ నేతలు అతన్ని ఆపడానికి హంతకులను కూడా పంపుతారు. కొందరు అధికారులు అతని దర్యాప్తును అడ్డుకుంటారు. చివరికి ఈ కేసును ఫోక్ ఎలా హాండిల్ చేస్తాడు ? కిట్ నిర్దోషిగా బయటికి వస్తాడా ? అనే విషయాలను, ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also :పెళ్ళి చేసుకుని భార్యకి దూరంగా ఉండే భర్త … కారణం తెలిసి షాక్ అయ్యే భార్య

ఏ ఓటీటీలో ఉందంటే

ఈ చైనీస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది ప్రాసిక్యూటర్’ (The Prosecutor). 2025 జనవరి 10న ఈ సినిమా అంతర్జాతీయంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు డోనీ యన్ దర్శకత్వం వహించారు. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి. ఈ సినిమా ప్రస్తుతం OTT ప్లాట్‌ ఫామ్‌ Amazon Prime Video, Lionsgate play  లలో అందుబాటులో ఉంది. 1 గంట 57 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.7/10 రేటింగ్‌ ఉంది.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×