Pushpa 2 Kochi.. 2021లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ‘పుష్ప’. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ గా ‘పుష్ప 2’ విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటు టాక్ పరంగా మాత్రమే కాకుండా అటు కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. నిన్న మొన్నటి వరకు టికెట్లు రేట్లు అధికంగా ఉన్నప్పటికీ కూడా రూ.600 కోట్ల క్లబ్లో చేరిపోయిన ఈ సినిమా, ఇప్పుడు టికెట్ ధరలు కూడా తగ్గించడంతో రూ.1000 కోట్ల క్లబ్ లో ఈజీగా చేరిపోతుందని నిర్మాతలు అంచనాలు వేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక థియేటర్లో అనుకోకుండా ‘పుష్ప 2: ది రూల్’ సినిమా సెకండ్ హాఫ్ మాత్రమే ప్రదర్శించడంతో థియేటర్లో కలకలం రేగింది. థియేటర్ యాజమాన్యం చేసిన పొరపాటు కారణంగానే సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు అయోమయంలో పడ్డారు.
కొచ్చి థియేటర్లో వింత ఘటన..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా, రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్గా వచ్చిన మోస్ట్ అవైటెడ్ చిత్రం పుష్ప 2. డిసెంబర్ ఐదవ తేదీన భారీ అంచనాలతో దాదాపు 12,000 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై సరికొత్త రికార్డు సృష్టించింది.. అలాగే విడుదలైన మొదటి రోజే రూ.294 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. తాజాగా ఈ సినిమాను ప్లే చేస్తున్న సమయంలో ఒక థియేటర్లో వింత ఘటన చోటుచేసుకుంది. థియేటర్ యాజమాన్యం పుష్ప 2 సినిమా సెకండ్ హాఫ్ ను మాత్రమే స్క్రీనింగ్ చేయడంతో ప్రేక్షకులు అయోమయంలో పడ్డారు. అసలేమైందా అంటూ ఆరా తీశారు
థియేటర్ యాజమాన్యం తప్పిదం..
కేరళ కొచ్చి లోని సినీ పోలీస్ సెంటర్ స్క్వేర్ థియేటర్లో సినిమా చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఈ థియేటర్లో అనుకోకుండా కేవలం సెకండ్ హాఫ్ మాత్రమే వేశారు. భారీ అంచనాలున్న ఈ సినిమాను చూడడానికి ఎంతో ఆత్రుతగా వెళ్లిన ప్రేక్షకులకు విచిత్ర అనుభవం ఎదురయింది. థియేటర్ యాజమాన్యం పొరపాటున సినిమా మొత్తాన్ని ప్రేక్షకులకు చూపించకుండా కేవలం సెకండ్ హాఫ్ మాత్రమే చూపించారు. సాయంత్రం 6:30 గంటల షో సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
డబ్బు వాపస్ చేయాలంటూ వీక్షకులు డిమాండ్..
ఇకపోతే వీక్షకులు ఎండ్ టైటిల్స్ పడుతున్న సమయంలో అది ఇంటర్వెల్ అని అనుకున్నారట. ఎందుకంటే ఈ ఆధునిక సినిమా యుగంలో నాన్ లీనియర్ గా కథను చెప్పే ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో ఇలా జరుగుతుందని ఆలోచించారు. కానీ కొంతమంది డౌట్ వచ్చి థియేటర్ మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేశారు. దాదాపు మూడు గంటల 20 నిమిషాల నిడివి ఉన్నా.. సినిమా ఫస్ట్ ఆఫ్ మొత్తాన్ని కూడా తమ మిస్టేక్ వల్లే ప్రేక్షకులు చూడలేకపోయారని అసలు నిజం తెలుసుకున్నారు.. ఇక అసలు విషయం తెలుసుకున్న ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యంపై ఫైర్ అవుతున్నారు. అంతేకాదు యాజమాన్యం చేసిన తప్పుకి తమ టికెట్ రేట్లకు చెల్లించిన డబ్బు మొత్తం వాపస్ చేయాలని డిమాండ్ చేయగా మరికొంతమంది మిగతా మొదటి అర్థ భాగాన్ని మళ్లీ ప్లే చేయాలని పట్టుబట్టారట. ఇక దీంతో చేసేదేమీ లేక సినీ పోలీస్ మేనేజ్మెంట్ స్పందిస్తూ.. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్ ను రాత్రి 9 గంటల సమయంలో కేవలం పదిమందికి మాత్రమే ప్లే చేయాలని డిసైడ్ అయ్యాడట. ఇక మిగతా వారంతా డబ్బు వాపస్ చేయాలని డిమాండ్ చేయడంతో రీఫండ్ చేస్తామని కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ గోల్మాల్ తర్వాత ప్రేక్షకుల డిమాండ్ ను థియేటర్ యాజమాన్యం ఒప్పుకోవడంతో వీక్షకులు సంతోషంగా వెనుతిరిగినట్టు సమాచారం.