RRR Movie: తెలుగు సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎవరు అంటే ఏ సందేహం లేకుండా రాజమౌళి (Rajamouli) అనే చెప్పాలి. ఆయన దర్శకత్వంలో సినిమా రావడం లేట్ అవ్వొచ్చేమో కానీ.. వచ్చిందంటే హిట్ అవ్వడం మాత్రం పక్కా అని తెలుగు ప్రేక్షకులకు గట్టి నమ్మకం. ఆ నమ్మకాన్ని రాజమౌళి కూడా నిలబెట్టుకుంటూ వచ్చారు. ఫ్యాన్స్ దృష్టిలో సినిమాను అందమైన శిల్పంలా చెక్కే జక్కన్నగా మారారు. అలాంటి రాజమౌళి దగ్గర నుండి తరువాతి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సమయంలోనే వారు ఊహించని మరో అప్డేట్ ఇచ్చారు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. ఆ అప్డేట్‌తో ఆడియన్స్ అంతా షాకవుతున్నారు.
ఎంత కష్టపడ్డారో చూడండి
రాజమౌళి చివరిగా దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్, ఎన్‌టీఆర్ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు సినీ స్థాయిని మరింత పెంచింది. ఎన్నో ఏళ్ల తర్వాత ఇండియాకు ఆస్కార్ వచ్చేలా చేసింది. ఆఖరికి ఫారిన్ ఆడియన్స్ కూడా ఒక తెలుగు సినిమా గురించి ఎన్నో ఏళ్లపాటు మాట్లాడుకునేలా చేసింది. అయితే ఈ మూవీ అంత పర్ఫెక్ట్‌గా తెరకెక్కడం వెనుక ఎంతో కష్టముంది. ‘ఆర్ఆర్ఆర్’ ప్రారంభించే ముందు ఎలాగైనా ఏడాదిలో ఈ సినిమా పూర్తి చేయాలని రాజమౌళి అనుకున్నారు. కానీ అది మూడు సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకుంది. ఆ షూటింగ్ వెనుక కష్టమేంటో మరో సినిమాతో చూపిస్తానంటున్నారు జక్కన్న.
Also Read: ‘ పుష్ప 2’ నిర్మాతలను ఇంటి కొచ్చి కొడతాం అంటూ వార్నింగ్… ఫహద్ పాత్రతో మేకర్స్ కు కొత్త సమస్య
బిహైండ్ ఆండ్ బియాండ్
రామ్ చరణ్ (Ram Charan), ఎన్‌టీఆర్ (NTR), రాజమౌళితో పాటు ఎంతోమంది ‘ఆర్ఆర్ఆర్’ను అంత అద్భుతంగా తెరకెక్కించడానికి కష్టపడ్డారు. అయితే ఆ కష్టం గురించి చెప్తూ ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ విడుదల కానుంది. ‘ఆర్ఆర్ఆర్: బిహైండ్ ఆండ్ బియాండ్’ (RRR Behind and Beyond) పేరుతో ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ విడుదల కానున్నట్టు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘ఈ ప్రపంచం కీర్తిని చూసింది. ఇప్పుడు కథను చూడండి. ఆర్ఆర్ఆర్ బిహైండ్ ఆండ్ బియాండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఈ డిసెంబర్‌లో మీ ముందుకు రానుంది’ అంటూ మేకర్స్ ఒక్క పోస్ట్‌తో ఈ విషయాన్ని బయటపెట్టారు. దీంతో ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్‌పై అప్పుడే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయింది.
మూడేళ్లయినా అదే క్రేజ్
‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలయ్యి దాదాపు మూడేళ్ల కావస్తోంది. అయినా కూడా ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులు దీని గురించి మాట్లాడుతున్నారంటే అందులో చాలావరకు క్రెడిట్ రాజమౌళికే దక్కాలని ప్రేక్షకులు అనుకుంటున్నారు. దీంతో ఇలాంటి సమయంలో ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ బయటికి రావడం ఫ్యాన్స్‌ను మరింత సంతోషపెట్టే విషయం. అయినా కొందరు ఆడియన్స్ మాత్రం ఆర్ఆర్ఆర్‌కు పార్ట్ 2 కావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి.. మహేశ్ బాబుతో మూవీని సెట్ చేశారు. దానికోసం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు. ఇప్పటికీ ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయంపై క్లారిటీ లేదు.
The world saw the glory.
Now witness the story!𝐑𝐑𝐑: 𝐁𝐞𝐡𝐢𝐧𝐝 & 𝐁𝐞𝐲𝐨𝐧𝐝
Documentary film coming this December 🔥🌊 #RRRBehindAndBeyond #RRRMovie pic.twitter.com/HNadZg2kem— RRR Movie (@RRRMovie) December 9, 2024