Pushpa 2 : హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది సెలబ్రిటీస్ అక్కడ తమ సినిమాను చూసి సెలబ్రేషన్స్ ను చేస్తూ ఉంటారు. ఇకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న ఈ థియేటర్లో సినిమా చూడాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. ఒక పెద్ద హీరో సినిమాకి ఇక్కడ టికెట్ దొరికి సినిమా చూడటం అంటే అదొక పండగలా ఉంటుంది. నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది సంధ్య థియేటర్. లేకపోతే చాలా రీ రిలీజ్ సినిమాలు కూడా ఇక్కడ ప్రదర్శించబడుతుంటాయి. కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు సంధ్య థియేటర్ ను వైకుంఠం అని కూడా ఫీలవుతూ ఉంటారు. ముఖ్యంగా రీసెంట్ టైమ్స్ లో రీ రిలీజ్ సినిమాలు రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఈ వీడియోలన్నిటిలో కూడా ఇక్కడ రికార్డు చేసినవే ఎక్కువ శాతం ఉంటాయి.
లేకపోతే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా రీసెంట్గా విడుదలైన సంగతి తెలిసిందే. ఇదివరకే మీరు కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ప్రస్తుతం దానికి సీక్వెల్ గా విడుదలైన సినిమా పుష్ప 2. ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ వసూలు చేసుకుంటూ ముందుకు వెళుతుంది. ఈ సినిమా సక్సెస్ అయిన విషయం పక్కన పెడితే ఈ సినిమా వలన ఒక కుటుంబం బలైపోయింది. అల్లు అర్జున్ కి వీరాభిమాని అయిన ఒక ఫ్యామిలీ పుష్ప సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోకు హాజరైంది. అయితే ఆ సినిమాకు అల్లు అర్జున్ కూడా తన కుటుంబ సభ్యులతో పాటు వచ్చాడు. పోలీసులకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అనేది పోలీసులు మాట్లాడుతున్న మాట. ఈ తరుణంలో అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట మొదలైంది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ అలానే తన బిడ్డ పరిస్థితి విషమంగా మారింది.
ఇక దీనిపై చిత్ర యూనిట్ కూడా రీసెంట్ గా స్పందించారు. అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలను ఆ కుటుంబానికి ఇస్తున్నట్లు ప్రకటించాడు. అంతేకాకుండా ఆ ఫ్యామిలీ మెడికల్ ఖర్చులు కూడా తను పూర్తి బాధ్యత వహిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ తప్పిదంలో థియేటర్ యాజమాన్యం పాత్ర ఎక్కువ శాతం ఉంది అని చెప్పాలి. సంధ్య థియేటర్లో చాలామంది సినిమాకు టికెట్ కొనుక్కోకుండా వచ్చేస్తూ ఉంటారు. ఇక ఈ ఘటన జరగడంతో ఈ కేసులో ముగ్గురును అరెస్టు చేశారు. సంధ్య థియేటర్ యజమానితోపాటు మేనేజర్ ను అరెస్టు చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్ కూడా అరెస్ట్ చేసి, ఈ ముగ్గురిని రిమాండ్ కు పంపారు చిక్కడపల్లి పోలీసులు.
Also Read : Tirupati Prakash: టాలీవుడ్ లో క్రెడిట్ చిరంజీవికే.. నటుడు ఏమన్నారంటే..?