BigTV English

Pushpa 2 Kissik song: కిస్సిక్ సాంగ్ ప్రోమో..ఫుల్ సాంగ్ వచ్చేది అప్పుడే..!

Pushpa 2 Kissik song: కిస్సిక్ సాంగ్ ప్రోమో..ఫుల్ సాంగ్ వచ్చేది అప్పుడే..!

Pushpa 2 Kissik song: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), డాన్సింగ్ క్వీన్ శ్రీ లీల(Sree Leela)కాంబినేషన్ లో వచ్చే ఐటమ్ సాంగ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సుకుమార్ (Sukumar ), అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న ‘పుష్ప -2’ లో వీరిద్దరి మధ్య ఐటమ్ సాంగ్ చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఐటెం సాంగ్ కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఆశలు పెట్టుకున్నారు. సినిమాలోని స్పెషల్ “కిస్సిక్”సాంగ్ అందరిలోనూ అంచనాలు సృష్టించింది. ఇక తాజాగా ఈ స్పెషల్ సాంగ్ కి సంబంధించి ప్రోమో విడుదల కాగా.. చిన్న బిట్ తోనే ఒక రేంజ్ లో వైబ్ క్రియేట్ చేసింది చిత్ర బృందం. దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ట్యూన్ సాంగ్ పై అసలైన ఎగ్జైట్మెంట్ పెరిగింది.


స్పెషల్ సాంగ్ ప్రోమో వైరల్..

ఈ పాటలో అల్లు అర్జున్ ఆటిట్యూడ్, శ్రీలీలా ఎనర్జీ మరో లెవెల్ లో కనిపించనున్నట్లు పోస్టర్ ద్వారా క్లారిటీ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిన్న ప్రోమో లో చూపిన విజువల్స్ గ్రాండ్ గా ఉండబోతున్నట్లు సమాచారం. బన్నీ స్వాగ్ , శ్రీ లీల స్టెప్పులు అందరి దృష్టిని ఆకర్షిస్తాయని మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఇకపోతే “ఊ అంటావా మావా” సాంగ్ తో “పుష్ప” మొదటి భాగంలో దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad)సంగీతానికి ఊహించని రెస్పాన్స్ లభించగా.. ఇప్పుడు ఈ “కిస్సిక్ సాంగ్” కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఈ ఐటెం సాంగ్ కు సంబంధించిన న్యూ పోస్టర్ కూడా విడుదల చేయగా.. ఇప్పుడు ఆ పోస్టర్ కి సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ లభిస్తోంది. పోస్టర్లలో బన్నీ, శ్రీ లీల అద్భుతమైన ఔట్పుట్ లో కనిపించగా.. వాళ్ల కెమిస్ట్రీ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోబోతోందని చెప్పవచ్చు.


రేపు సాయంత్రం 7:00 గంటలకు స్పెషల్ సాంగ్ రిలీజ్..

ఇకపోతే మేకర్స్ ఈ సాంగ్ కోసం ఖర్చుకి కూడా వెనుకాడడం లేదు. భారీ సెట్స్ వేసి మరీ చిత్రీకరించారు. ఇక సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ పాట ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించే కీలక ఎలిమెంట్ అవుతుందని కూడా అందరూ అంటున్నారు. ఇకపోతే పూర్తి పాట కావాలి అంటే రేపు అనగా నవంబర్ 24 సాయంత్రం 7:02 కి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 5వ తేదీన విడుదల కానున్న పుష్ప: ది రూల్ గురించి ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు ఆ అంచనాలను ఈ సాంగ్ మరింత పెంచబోతుందని అందరూ భావిస్తున్నారు.

మరో సంచలనానికి సిద్ధం..

మొత్తానికైతే ఈ పాట థియేటర్లలో సరికొత్త పండగ వాతావరణం తీసుకొస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. ఇప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ ఒక్క హీరో కూడా అందుకోని జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. అంతేకాదు మొట్టమొదటి జాతీయస్థాయి అవార్డు అందుకున్న తెలుగు హీరోగా కూడా నిలిచిపోయారు బన్నీ. ఇక ఇప్పుడు పుష్ప -2 తో మరో సంచలనం సృష్టించనున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×