BigTV English

Pushpa 2 movie Postpone : “పుష్ప 2” పోస్ట్ పోన్… ఇదే జరిగితే కొత్త రిలీజ్ డేట్ ఆ రోజునే?

Pushpa 2 movie Postpone : “పుష్ప 2” పోస్ట్ పోన్… ఇదే జరిగితే కొత్త రిలీజ్ డేట్ ఆ రోజునే?

Pushpa 2 movie Postpone : అల్లు అర్జున్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ “పుష్ప 2” (Pushpa 2) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ ఈ సినిమా గురించి వస్తున్న వార్తలే అభిమానులను నిరాశ పరుస్తున్నాయి. తాజాగా ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ కాబోతుందంటూ సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఆ రూమర్లు గనక నిజమైతే, మూవీ కొత్త రిలీజ్ డేట్ ఏంటి అనే చర్చ నడుస్తోంది. తాజాగా ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఆ ప్రశ్నకు కూడా సమాధానం దొరికింది.


అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప 2” (Pushpa 2). వరల్డ్ వైడ్ గా ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ చూశాక సినిమా ఓపెనింగ్ డే 200 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొడుతుందని, ఈ మూవీ 1000 కోట్లు రాబట్టడం పెద్ద కష్టమేం కాదు అన్న అభిప్రాయాలు కూడా మొదలయ్యాయి. మరోవైపు ఈ మూవీలోని ఐటెం సాంగ్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పుష్పరాజ్ ఫ్యాన్స్. ఇంత బజ్ నెలకొన్న ఈ సినిమా పోస్ట్ పోన్ కాబోతుందని టాక్ నడుస్తోంది ఇండస్ట్రీలో.

ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ కి ఇంకా రెండు వారాలు కూడా లేదు. అయినప్పటికీ ఇప్పుడు ఈ సినిమాలోని సాంగ్, ఫైట్ షూట్ జరుగుతుండడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. సుకుమార్ తన టీంను ఉరుకుల పరుగులు పెట్టిస్తూ, రాత్రి పగలు తేడా లేకుండా పని చేయిస్తూ… సినిమాను పూర్తి చేయిస్తున్నారట. నిజానికి నవంబర్ 20న ఈ మూవీ ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని చెప్పారు. కానీ తీరా చూస్తే ఇప్పుడు నవంబర్ 28 నాటికి షూటింగ్ కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. అప్పటికి కూడా మూవీ రిలీజ్ ఇంకా వారం రోజులు మాత్రమే మిగిలి ఉంటుంది.


కాబట్టి ఫస్ట్ కాపీ రెడీ కాకపోవచ్చు అనే టాక్ చక్కర్లు కొడుతోంది. అందుకే ఈ మూవీ రిలీజ్ డేట్ ను మారుస్తారని అంటున్నారు. సినిమా రిలీజ్ విషయంలో తగ్గేదే లేదు అంటూ చిత్ర బృందం పోస్ట్ చేసినప్పటికీ, ఈ సినిమా ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నాయి సినీవర్గాలు. ఒకవేళ అదే గనక జరిగితే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఏంటి అనే ఆసక్తి నెలకొంది. దానికి సమాధానమే డిసెంబర్ 19న “పుష్ప 2” (Pushpa 2) కొత్త రిలీజ్ డేట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ మూవీ రిలీజ్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

ఇప్పటికే “పుష్ప 2” (Pushpa 2) మూవీ రెండుసార్లు పోస్ట్ పోన్ అయింది. ముందుగా ఈ మూవీని ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 6కి మార్చారు. అది కూడా వద్దని డిసెంబర్ 5కి వచ్చారు. ఇప్పుడు ఇది కూడా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×