Face Pack: శరీరానికి పోషణను అందించే పప్పులు చర్మానికి కూడా మేలు చేస్తాయి.చలికాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మార్కెట్‌లో లభించే ఫేస్ ప్యాక్‌లు చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కొన్ని రకాల హోం ఫేస్ ప్యాక్‌లు ఇంట్లోనే తయారు చేసుకుని వాడవచ్చు.
మార్కెట్ లో లభించే ఫేస్ ప్యాక్ ల కంటే ఇవి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. అంతే కాకుండా వీటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇంట్లోనే కొన్ని రకాలపప్పులతో అద్భుతమైన ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. ఇవి చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు మృదువుగా మార్చడంలో సహాయపడతాయి.
రెండు వేర్వేరు పప్పులను మిక్స్ చేసి తయారు చేసిన ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తుంది. పప్పులో చర్మానికి చాలా మేలు చేసే ప్రొటీన్లు, విటమిన్లు , మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
పప్పులతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి ?
1. మసూర్ పప్పు,శనగపప్పులతో ఫేస్ ప్యాక్ :
కావలసినవి:
మసూర్ పప్పు – 2 స్పూన్లు
శనగ పప్పు – 2 స్పూన్లు
పాలు – 2 స్పూన్లు
పసుపు – చిటికెడు
తయారీ విధానం: పై రెండు పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే వీటిని గ్రైండ్ చేసి పేస్టులా చేసుకోవాలి. అందులోనే పాలు, పసుపు కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
2. మినప పప్పు, పెసర పప్పుతో ఫేస్ ప్యాక్ :
కావలసినవి:
మినప పప్పు – 2 స్పూన్లు
పెసర పప్పు – 2 స్పూన్లు
పెరుగు – 2 స్పూన్లు
నిమ్మరసం – కొన్ని చుక్కలు
తయారీ విధానం: రెండు పప్పులను గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి పెరుగు, నిమ్మరసం కలపండి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
3.పెసర పప్పు , మినపపప్పుతో ఫేస్ ప్యాక్:
కావలసినవి:
పెసర పప్పు – 2 టీస్పూన్లు
మినపపప్పు – 2 టీస్పూన్లు
పాలు – 1 టీస్పూన్
రోజ్ వాటర్ – 2 టీస్పూన్లు
తయారీ విధానం: రెండు పప్పులను గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనికి శనగపిండి , రోజ్ వాటర్ కలపండి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.తరుచుగా ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖం తెల్లగా మారుతుంది. తరుచుగా వీటిని వాడటం వల్ల ముఖంపైఉన్న ట్యాన్ తొలగిపోతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
Also Read: మీ ముఖం నల్లగా మారిందా.. ఈ టిప్స్‌తో గ్లోయింగ్ స్కిన్
ఈ ఫేస్ ప్యాక్స్ వల్ల కలిగే ప్రయోజనాలు:
చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తాయి
మొటిమలు, మచ్చలను తగ్గిస్తాయి.
చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తాయి.
చర్మంపై తేమను కాపాడతాయి.
టాన్ తొలగించడంలో సహాయపడతాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.