BigTV English

Pushpa 2: అక్కడ రఫ్ఫాడిస్తున్న పుష్పరాజ్.. ఏకంగా రూ.800 కోట్లతో..!

Pushpa 2: అక్కడ రఫ్ఫాడిస్తున్న పుష్పరాజ్.. ఏకంగా రూ.800 కోట్లతో..!

Pushpa 2..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తొలిసారి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (Raghavendra rao) దర్శకత్వంలో ‘గంగోత్రి’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈయన, ఆ తర్వాత అన్ని సెలెక్టివ్ గా పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చారు. ఇక 2021లో సుకుమార్(Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేసి ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయారు. ఈ ఒక్క సినిమాతో బాలీవుడ్ లో భారీ క్రేజ్ ఏర్పడింది. అంతేకాదు ఏకంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది. ఇక అదే ఊపుతో దాదాపు మూడు సంవత్సరాల పాటు నిర్విరామంగా కష్టపడి, గత ఏడాది డిసెంబర్ ఐదవ తేదీన ‘పుష్ప 2’ సినిమా విడుదల చేశారు. విడుదలైన మొదటి రోజే రూ.294 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే రూ.1000 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డు సృష్టించింది.


ఊహించని రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న పుష్ప 2..

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా బాలీవుడ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసినట్లు సమాచారం. డిసెంబర్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా అత్యంత వేగంగా రూ.1000, రూ.1500, రూ.1700 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది . ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.1800 కోట్ల మార్క్ టచ్ చేసి ‘బాహుబలి 2’ రికార్డును సైతం బ్రేక్ చేసింది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ లో ఒక బాలీవుడ్ నుంచే దాదాపు సగం వరకు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటివరకు బాలీవుడ్ సూపర్ స్టార్స్ అయినా సల్మాన్ ఖాన్ (Salman Khan), అమీర్ ఖాన్(Ameer Khan), షారుక్ ఖాన్ (Sharukh Khan) లకు కూడా ఈ రేంజ్ లో వసూళ్లు రాబట్టడం సాధ్యం కాలేదు. ఇప్పటికీ కూడా నార్త్ ఇండస్ట్రీలో సాలిడ్ ఆక్యుపెన్సీ తో దూసుకెళ్తోంది పుష్ప 2.


బాలీవుడ్లో సరికొత్త రికార్డు..

తాజాగా బాలీవుడ్ లో ఈ సినిమా రూ.806 కోట్ల మార్కును టచ్ చేసి ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. కేవలం 31 రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టి హిందీ బాక్సాఫీస్ వద్ద నంబర్ వన్ సినిమాగా చరిత్ర సృష్టించడమే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీ వద్ద టాలీవుడ్ హీరో టాప్ -1 స్థానంలో నిలిచారు. దాంతో రూ.800 కోట్లు అందుకున్న ఫస్ట్ హిందీ సినిమాగా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ దూకుడు చూస్తుంటే పుష్ప గాడి క్రేజ్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.

పుష్పగాడి ముందు నిలబడలేకపోయిన బాలీవుడ్ మూవీస్..

ఇకపోతే ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన సినిమాలు పుష్ప 2 ముందు కనీసం నిలబడలేకపోయాయి. వరుణ్ ధావన్(Varun Dhawan), కీర్తి సురేష్ (Keerthi Suresh) జంటగా నటించిన ‘బేబీ జాన్’ ఒక మోస్తారు ఇమేజ్ తెచ్చుకున్నప్పటికీ కూడా పుష్ప2 ప్రభంజనానికి తట్టుకోలేక డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పట్లో పెద్ద సినిమాలు కూడా ఏవీ లేకపోవడం వల్ల కలెక్షన్లు కూడా స్టడీగా కొనసాగుతున్నాయి. ఇక ఇలాగే కొనసాగితే మాత్రం రూ.1000 కోట్ల మార్క్ అందుకుంటుందని సినీ విశ్లేషకులు కూడా కామెంట్లు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే పుష్ప రేంజ్ మాత్రం అందరికీ అర్థమవుతుందని చెప్పవచ్చు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×