BigTV English

New Poster from Pushpa 2: అరేయ్.. సినిమాలో జాతర ఉందా? లేక జాతరే సినిమాగా తీశారా?

New Poster from Pushpa 2: అరేయ్.. సినిమాలో జాతర ఉందా? లేక జాతరే సినిమాగా తీశారా?
Pushpa 2 New Poster
Pushpa 2 New Poster

New Poster from Allu Arjun’s Pushpa 2 Movie: పుష్ప మాస్ జాతర.. పుష్ప జాతర షురూ.. జాతర షూటింగ్ జరుగుతుంది.. జాతర సీక్వెన్స్ లో అల్లు అర్జున్ గెటప్ ఉంటుంది..? సుకుమార్ జాతర సీన్స్ చేస్తున్నాడు. పుష్ప 2 మొదలైనప్పటి నుంచి జాతర .. జాతర.. జాతర .. ఇదే పదం వినిపిస్తుంది. పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 ను మొదలుపెట్టాడు సుకుమార్. పుష్పరాజ్ గా బన్నీ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి.


ఇక ఈ సినిమానే బన్నీకి జాతీయ అవార్డు తీసుకొచ్చి పెట్టింది. పాన్ ఇండియా లెవెల్లో బన్నీకి గుర్తింపు తెచ్చింది. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మార్చింది. దాదాపు మూడేళ్లు గా ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఆ ఎదురుచూపులకు ఆగస్టు 15 న ఫుల్ స్టాప్ పడనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజైన ఏ పోస్టర్ అయినా జాతరకు సంబంధించిందే అవ్వడం విశేషం.

మొట్టమొదటిసారి పుష్ప పోస్టర్ ను రిలీజ్ చేసినప్పుడు బన్నీ చీరకట్టుతో కనిపించాడు. జాతరలో బన్నీ ఈ లుక్ లో కనిపించనున్నాడు అని, జాతర సీక్వెన్స్ నెస్ట్ లెవల్ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఈ సినిమా నుంచి లీకైన వీడియోస్, ఫొటోస్ అన్ని జాతరకు సంబంధించినవే. అంతెందుకు ఈ మధ్య రిలీజ్ చేసిన టీజర్ లుక్ లో కూడా జాతరలో బన్నీ కాలుకు గజ్జెలు కట్టి చూపించారు.


Also Read: Pushpa 2 The Rule: పెంచు.. పెంచు.. హైప్ తో జనాలు చచ్చిపోవాలా..?

ఇక ఇప్పుడు కొత్త పోస్టర్ లో కూడా త్రిశూలాలు చూపిస్తూ టీజీర్ కు ఇంకా రోజులు ఉందని గుర్తుచేశారు. దీంతో చాలామంది అరేయ్.. సినిమాలో జాతర ఉందా.. జాతరే సినిమాగా తీశారా.. ? ఎప్పుడు ఈ జాతరకు సంబంధించిన పోస్టర్స్ కాకుండా వేరే పోస్టర్స్ లేవా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి సుకుమార్ ఈ జాతరను చూపించి పుష్ప 2 ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×