Pushpa 2 Premiere Show : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2). అత్యంత భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొగా, డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రీమియర్ కు సంబంధించిన అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. మరి ‘పుష్ప 2’ మూవీ ప్రీమియర్స్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం పదండి.
‘పుష్ప 2 : ది రూల్’ (Pushpa 2) మూవీ ప్రపంచవ్యాప్తంగా 12,000 థియేటర్లకు పైగా, ఆరు భాషల్లో రిలీజ్ కాబోతోంది. అయితే అభిమానులను మరింతగా ఉత్సాహపరచడానికి మేకర్స్ ఈ మూవీ ప్రీమియర్స్ కు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించి అన్ని సిటీలలో రాత్రి ఒంటి గంట నుంచి మిడ్ నైట్ షోలు వేసి, పుష్ప వేడుకలను ప్రారంభించాలని అనుకున్నారు. కానీ దీనికి సంబంధించి మేకర్స్ కి పలు ఛాలెంజెస్ ఎదురవుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం మిడ్ నైట్ స్క్రీనింగ్ ఆపాలని చర్యలు తీసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ‘పుష్ప 2’ ప్రీమియర్ల విషయం హాట్ టాపిక్ గా మారింది.
అయితే తాజా సమాచారం ప్రకారం ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2) మూవీకి సంబంధించి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్లతో ఈరోజు చర్చలు జరపబోతోంది. ఎన్ని థియేటర్లలో ప్రీమియర్లు వేయాలి ? అనే విషయమై సాయంత్రానికల్లా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏపీతో పాటు తెలంగాణలో కూడా వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో ప్రీమియర్లు ప్రదర్శించాలన్నది నిర్మాతల ఆలోచన. అయితే ఈ ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు “దేవర ” రికార్డులను బ్రేక్ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 4 అర్ధరాత్రి 12:45 నిమిషాలకు ప్రీమియర్లకు ముహూర్తం ఖరారు చేశారు. అయితే ఈ ప్రీమియర్ షోలకు ఒక్కో టికెట్ కి ధర రూ.1000 గా నిర్ణయించినట్టు సమాచారం.
అలాగే మరోవైపు టికెట్ల ధరల విషయంలోనూ ‘దేవర’ కంటే ఎక్కువగా పెంచుకునే అవకాశం కోసం ఎదురు చూస్తోంది ‘పుష్ప 2’ (Pushpa 2) టీం. 200 కోట్లకు పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రంగంలోకి దిగుతున్న ‘పుష్ప 2’ టీం కొత్త రికార్డులు సెట్ చేయాలనే ఉద్దేశంతో అదనంగా టికెట్ ధరల పెంపు కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది, . అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అనేది చూడాలి. టిక్కెట్ ధర ఆరు వందలు దాకా అడుగుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇదే గనుక నిజమైతే టికెట్ రేట్ల పరంగా అభిమనులపై భారం పడడం ఖాయం. మరి అనుకున్నట్టుగా పుష్పరాజ్ ‘దేవర’ ప్రీమియర్ రికార్డును బ్రేక్ చేస్తాడా? అనేది తెలియాలంటే సాయంత్రం ప్రీమియర్స్ గురించి మేకర్స్ అఫీషియల్ గా అప్డేట్ ఇచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.