Pushpa 2 Premiere Shows: అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప 2’ దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలవుతోంది. ఈ సినిమా ఆల్రెడీ హిట్టే అని ఫ్యాన్స్‌తో పాటు చాలామంది సినీ సెలబ్రిటీలు కూడా నమ్ముతున్నారు. అయినా విడుదలకు ఇంకా ఒక్కరోజే ఉన్నప్పుడు కూడా ‘పుష్ప 2’కు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటోంది. ఇప్పటికీ ఈ ఇబ్బందులకు బ్రేక్ పడినట్టుగా అనిపించడం లేదు. డిసెంబర్ 5న ఈ సినిమా విడుదలవుతున్నా కూడా డిసెంబర్ 4న ఈ మూవీ ప్రీమియర్స్ ప్రారంభం అవుతున్నాయి. కానీ ఆ ఒక్క ప్రాంతంలో మాత్రం మిడ్‌నైట్ షోలు రద్దు కానున్నాయి.
కలెక్టర్ నిర్ణయం
డిసెంబర్ 4 నుండే ‘పుష్ప 2’ (Pushpa 2) పెయిడ్ ప్రీమియర్ షోలు నిర్వహించాలని నిర్మాతలు నిర్ణయించారు. కానీ ఈ ప్రీమియర్ షోలకు మామూలు మిడిల్ క్లాస్ మూవీ లవర్ కొనుగోలు చేయలేని రేంజ్‌లో ధరలు పెంచేశారు. అందుకే ప్రేక్షకుల దగ్గర నుండి మాత్రమే కాకుండా ఇండస్ట్రీ నిపుణుల దగ్గర నుండి కూడా దీనిపై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణ విషయం పక్కన పెడితే బెంగుళూరులో అయితే ధరలు మరీ దారుణంగా ఉన్నాయి. కొన్ని మల్టీప్లెక్స్‌లో ‘పుష్ప 2’ ప్రీమియర్ చూడాలంటే రూ.2000 టికెట్‌ను కొనుగోలు చేయాల్సి వస్తుంది ప్రేక్షకులు. దీంతో కన్నడ సినీ నిర్మాతలు, బెంగుళూరు జిల్లా కలెక్టర్ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు.
Also Read: మెగా ఫ్యాన్స్ లేకపోతే ఏంటి, మేము ఉన్నాం.. అల్లు అర్జున్‌కు వైసీపీ ఫాలోవర్స్ సపోర్ట్
నష్టం తప్పదు
‘పుష్ప 2’ బెనిఫిట్ షోలు రద్దు చేయమంటూ బెంగుళూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నా పర్వాలేదంటూ ఇప్పటికే కొందరు ప్రేక్షకులు ఈ షోలకు టికెట్లు బుక్ చేశారు. అయినా కూడా షోలు క్యాన్సెల్ చేయాలని కలెక్టర్ నిర్ణయించుకున్నారు. టికెట్ కొనుగోలు చేసినవారికి తిరిగి డబ్బులు రిఫండ్ అవుతాయని తెలుస్తోంది. అయితే ఇది ‘పుష్ప 2’కు మేకర్స్‌కు భారీ షాక్ అనే చెప్పాలి. ప్రీమియర్ షోల నుండే సినిమాకు అత్యధిక కలెక్షన్స్ వస్తాయని మేకర్స్ నమ్ముతున్నారు. ఇదే సమయంలో బెంగుళూరు మొత్తంలో మిడ్‌నైట్ షోలు క్యాన్సల్ అవ్వడం వల్ల మేకర్స్‌కు అక్కడ ఆశించినంత లాభాలు రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
సపోర్ట్ లేదు
‘పుష్ప 2’ సినిమాకు ఇప్పటికే ఇతర నిర్మాతల నుండి చాలా వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే తెలంగాణలో టికెట్ రేట్లు భారీగా పెంచేశారని ఒకరు పిటీషన్ దాఖలు చేశారు. చివరి నిమిషంలో టికెట్ ధరలు మార్చడం అసాధ్యమని హైకోర్టు తేల్చేసి మేకర్స్‌కు ఊరటనిచ్చింది. కానీ చివరికి ఇలా ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచడం కరెక్ట్ కాదని నిర్మాతలను మందలించింది కూడా. తెలుగులో హైకోర్టు నుండి నిర్మాతలు వార్నింగ్ తీసుకోగా.. ఇప్పుడు పెరిగిన టికెట్ ధరలను సపోర్ట్ చేసేది లేదంటూ కన్నడ నిర్మాతలు వెనకడగు వేశారు. బెంగుళూరులో ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ డిసెంబర్ 5 మార్నింగ్ షో వరకు ఎదురుచూడాల్సిందే.
🚨 BREAKING: Bengaluru District Collector orders to STOP #Pushpa2TheRule midnight shows. https://t.co/OZjy3TlIx1 pic.twitter.com/qwKlDKkfc6
— Manobala Vijayabalan (@ManobalaV) December 4, 2024