Pushpa 2 Reloaded Version:పుష్ప 2 (Pushpa2).. అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా, సుకుమార్ (Sukumar)దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇది. భారీ అంచనాల మధ్య జనవరి 5వ తేదీన విడుదలై, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే సినిమా విడుదలై నెల రోజులు దాటడంతో.. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాలు రావడంతో ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ నుంచి పుష్ప 2 వెళ్ళిపోయింది. కానీ నార్త్ లో మాత్రం ఇంకా హవా కొనసాగిస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాకి ఒక్క నార్త్ నుంచే అధిక కలెక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా అక్కడి ఆడియన్స్ లో ఈ సినిమాకి ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ మొత్తం థియేటర్లను నింపేస్తూ ఇప్పటికీ అదే హౌస్ ఫుల్ థియేటర్లతో సినిమా నడుస్తోంది అంటే, బన్నీ మూవీకి బాలీవుడ్ లో క్రేజ్ ఎలా ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా రూ.1850 కోట్ల గ్రాస్ వసూలు చేసి, బాహుబలి2 రికార్డును కూడా బ్రేక్ చేసింది.
పుష్ప2 రీలోడెడ్ వర్షన్..
ముఖ్యంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అమీర్ ఖాన్ (Aamir Khan) నటించిన ‘దంగల్’ సినిమా రూ.2000 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఆ రికార్డును కూడా బద్దలు కొట్టాలనే ప్లాన్లో ఉంది అని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకి మరో 20 నిమిషాల సీన్స్ జత చేసి జనవరి 17వ తేదీన మళ్లీ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.దీనిని “పుష్ప 2 రీ లోడెడ్ వర్షన్” అంటూ మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సినిమాలు ఉన్నాయి కాబట్టి దొరికిన థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. పుష్ప2 రీలోడెడ్ వర్షన్ జనవరి 17వ తేదీన రిలీజ్ చేస్తుండగా.. ఆ రోజు సినిమా లవర్స్ డే అంటూ టికెట్ల రేట్లు భారీగా తగ్గించి స్పెషల్ ఆఫర్ పెట్టారు మేకర్స్.
నార్త్, నైజాంలో భారీ టికెట్ ధర తగ్గింపు..
నార్త్ లో పుష్ప 2 జనవరి 17వ తేదీన కేవలం 112 రూపాయలు మాత్రమే అని, పోస్టర్ తో సహా రిలీజ్ చేయడం గమనార్హం. నైజాంలో సింగిల్ స్క్రీన్ లో 112 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 150 రూపాయలు అని ప్రకటించారు.అయితే ఈ ఆఫర్ కేవలం నార్త్, నైజాంలో మాత్రమే అని తెలుస్తోంది. ఇక ఏపీలో అలాగే సౌత్ లో ఈ ఆఫర్ ఉంటుందో? ఉండదో?ఇంకా ప్రకటించలేదు. మొన్నటి వరకు రూ.300 నుంచి రూ.500 వరకు ఉన్న టికెట్టు భారీగా తగ్గింది. అయితే రేపు ఒక్కరోజు మాత్రమే 112 రూపాయలు పెట్టడంతో నార్త్ నుంచి భారీ కలెక్షన్లు వస్తాయని కూడా మేకర్స్ భావిస్తున్నారు. మొత్తానికైతే రూ.2000 కోట్ల గ్రాస్ టార్గెట్ గా పెట్టుకున్న పుష్ప 2 రేపటితో ఆ టార్గెట్ రీచ్ అవుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. జగపతిబాబు, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రముఖ యంగ్ బ్యూటీ శ్రీ లీల ఇందులో స్పెషల్ సాంగ్ లో నర్తించింది.