BigTV English

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి అనుమానం కలిగించిన రోహిణి.. రవి శోభనం క్యాన్సిల్..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి అనుమానం కలిగించిన రోహిణి.. రవి శోభనం క్యాన్సిల్..

Gundeninda GudiGantalu Today episode January 16th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో వంట చేయడం రాదని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. మ్యాగీ ఆమ్లెట్ వేసుకోవడం కూడా రాదా శృతి అని రోహిణి అడుగుతుంది. నాకు ఇప్పటివరకు వంట చేసే అవసరం రాలేదు అని శృతి అంటుంది ఇక శృతి తన గదిలోకి వెళ్లి డబ్బింగ్ చెప్తుంది. ప్రభావతి మీనాకు వార్నింగ్ ఇస్తుంది. శృతి విషయంలో నువ్వు అతిగా వినయం పాటిస్తే మర్యాద ఉండదు నీలాగా పూల అమ్ముకునే ఇంటి నుంచి వచ్చింది అనుకున్నావా? కోటీశ్వరులు బిడ్డ ఎలా ఉండాలో అలా ఉండాలి అని చెప్తుంది. అలాగే అత్తయ్యని మీనా అంటుంది. ఇక ప్రభావతి మీనా తో మాట్లాడుతున్నప్పుడు నేను ఇంట్లో ఉండను వెళ్ళిపోతానని శృతి అనడం ప్రభావతి వింటుంది. నువ్వేమైనా అన్నావని మీనాను అడుగుతుంది. మీతోనే ఉన్నాను కదా అత్తయ్య నేను ఏమంటాను అసలు శృతిని నేను ఏమైనా అంటానా అని మీనా అడుగుతుంది. ఇక బయట రవి కూర్చొని ఉంటే ప్రభావతి మీనా ఇద్దరు రవి దగ్గరికి వెళ్తారు. ఏమైందిరా శృతి వెళ్లిపోవాలనుకుంటుంది ఏదైనా గొడవ పడిందా లేక ఈ ఇల్లు నచ్చలేదని రవిని అడుగుతుంది. డబ్బింగ్ చెప్పానని క్లారిటీ ఇస్తుంది. ఇక మీనాను రిక్వెస్ట్ చేసి ఆ గదిని డెకరేషన్ చెయ్యమని చెబుతుంది. బాలు రాగానే నా గది ఇవ్వబోము అని అంటాడు. మీనా నచ్చ చెప్పడంతో ఫైనల్ గా ఒప్పుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి తన చిన్న కొడుకు రవి, కోడలు శృతి ల కోసం వెయిట్ చేస్తుంటుంది. వారి శోభనానికి ఎలాంటి అడ్డంకులు రాకుండా, బాలు ఇలాంటి గొడవలు చేయకుండా ఆ దేవుని ప్రార్థిస్తుంది. ఇంతలోనే రవి,శ్రుతి ఇంటికి చేరుకుంటారు. ‘మీ కోసమే నేను వెయిట్ చేస్తున్నా.. త్వరగా వచ్చి భోజనం చేయండి ‘ అిని ప్రభావతి అంటుంది. తాము ఆల్రెడీ బయట తినేసామని శృతి చెబుతుంది. దానికి రియాక్ట్ అయిన ప్రభావతి ఏంటి బయటే టిఫిన్ చేశారా? ఎందుకలా అని అడుగుతుంది. శృతి ఏంట్రా అవి మనం బయట టిఫిన్ కూడా చేయకూడదా అని అంటుంది. మీనా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే ప్రభావతి మీనా ఏం చూస్తున్నావ్ లోపలికి వెళ్లి భోజనానికి సిద్ధం చేయాలి అంటుంది వాళ్ళిద్దరూ భోజనం చేశారు కదా అత్తయ్య అని అంటుంది. ప్రభావతి వాళ్ళు తింటే మిగతా వాళ్ళు తినకూడదా వెళ్లి రెడీ చెయ్యు అని పంపిస్తుంది. ఇక ప్రభావతి వాళ్ళిద్దరికీ శోభనం అని చెప్పడానికి చాలా ఇబ్బంది. నాకు తెలియదని అంటాడు మొత్తానికి నాన్న తిప్పలు బడి రోహిణి ద్వారా ప్రభావతి శోభనం గురించి చెప్పిస్తుంది.

శృతి మాటకు షాక్ అవుతుంది రోహిణి.. ఫస్ట్ నైట్ అని మీరు చెప్పొచ్చు కదా దానికి ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు ఆంటీ ఇప్పట్లో చెప్పేలా లేదు కదా ఇక రవి కూడా విషయం నేనే చెప్తాను అని అంటుంది. నువ్వు వెళ్లి సారీ కట్టుకోవాలంటే కానీ సారీ నాకు కట్టుకోవడం రాదని శృతి డ్రెస్ వేసుకొని కిందకు వస్తుంది. రవిని ప్రభావి అడుగుతుంది ఇదేంట్రా సారీ కట్టుకోమంటే డ్రెస్ లో వచ్చింది ఏంటి అని అంటే నాకు శారీ కట్టుకోవడం రాదు అంటి అందుకే డ్రెస్సులో వచ్చాను అని ఏమాత్రం సిగ్గుపడకుండా శృతి చెప్పడంతో ప్రభావతి షాక్ అవుతుంది. ఇక ప్రభావతి రోహిణి పిలిచి శ్రుతి కి శారీ కట్టమని చెప్తుంది. మరోవైపు.. బాలు తనలో తాను ఫీల్ అవుతాడు ఒంటరినైపోయాయని, ఎక్కడ ఉండేవాణ్ణి ఎక్కడ ఉన్నాను. ఈరోజు మిద్దెపై ఉన్న.. రేపు ఎక్కడ ఉంటానని బాధపడుతూ ఉంటాడు. ’40 లక్షల మింగినోడు బాగానే ఉన్నాడు.. ఇంట్లో నుండి లేచిపోయినోడు కూడా బాగున్నాడు… ఇల్లు తాకట్టు బాగున్నారు.. ఎటు వచ్చి.. పూలగంప ముళ్ళగంప.. చిక్కులో పడ్డారు’ అని తనలో తానే ఫీల్ అవుతాడు. మరోవైపు ప్రభావతి కంగారుపడుతుంది మీనా ను పిలిచి.. అన్ని ఏర్పాట్లు చేయమని చెప్తుంది.


ఇక రోహిణి శృతికి శారీ కడుతుంది.సమయంలో శృతి.. రోహిణి గురించి ఆరా తీస్తుంది. మలేషియాలో మీ ఇల్లు ఎక్కడ ఉంటుందని రోహిణి ప్రశ్నిస్తుంది. సిటీలో ఉంటుందని చెబుతుంది రోహిణి.. అదే సిటీలో ఎక్కడ ఉంటుంది.. అక్కడ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అని అడుగుతుంది. ఇలానే అడిగితే.. తన ఉనికినే ప్రమాదమని, టాపిక్ డైవర్ట్ చేయాలని నోరు మూసుకుంటావా శ్రుతి అంటుంది. దీంతో శృతి షాక్ అవుతుంది. అదేం లేదు.. లిప్ స్టిక్ పెట్టాలని చెబుతోంది. ఆ తర్వాత మీనా గురించి మాట్లాడుతూ.. మీనా చాలా మంచిది, కానీ, బాలు మాత్రం ఇష్టం వచ్చినట్లు తాగి నానా మాటలు అంటాడు.. బాలు తాగితే అలాగే ప్రవర్తిస్తాడని, ఒక మామయ్య మాట తప్ప ఎవరి మాటలు లెక్కచేయడని రోహిణి చెబుతోంది. అలాంటి మొండి వాడితో మీనా ఎలా ఉంటుంది. డైవర్స్ ఇప్పిద్దాం శృతి అంటుంది. దీంతో రోహిణి షాక్ అవుతుంది. ఆ తర్వాత మనోజ్ గురించి రోహిణితో మాట్లాడుతూ.. మనోజ్ ఏం చేస్తున్నాడని అడుగుతోంది. మనోజ్ కార్ల షోరూంలో పనిచేస్తాడని, ఆ షో రూమ్ కు మేనేజర్ అని చెబుతుంది రోహిణి.. ఇక మనోజ్ శృతిని ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేయాలని అనుకుంటాడు. తాను మరో బ్యూటీ పార్లర్ పెట్టాలనుకుంటున్నానని, శృతి తో ఉంటే హెల్ప్ అవుతుందని కవరింగ్ చేస్తోంది. కానీ మనోజ్ కి అసలు విషయం అర్థం కాదు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో రవి బాలు తో మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Stories

×