Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. ముంబైలోని ఆయన నివాసంలో సైఫ్ అలీఖాన్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. దాడి చేసిన అనంతరం దుండగుడు అక్కడ నుంచి పరారయ్యాడు. ప్రమాదంలో సైఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. సైఫ్‌కు మొత్తం ఆరు చోట్ల గాయాలైనట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆస్పత్రిలో ఆయనకు సర్జరీ కొనసాగుతోంది. సర్జిరీ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
సైఫ్ అలీఖాన్, అతని కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా.. దొంగ ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అతడిని గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా కత్తితో దాడి చేసి పరారైనట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Sankranti festival: ఈసారి సంక్రాంతి పండుగ మాస్ జాతర.. తగ్గేదేలే..!
అర్ధరాత్రి 2 గంటల సమయంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ రెండు, మూడు చోట్ల కత్తి పోటుకు గురయ్యాడు. అసలు ఈ హత్య ఎవరు చేశారు..? చేయడానికి గల కారణాలు ఏంటి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలీవుడ్‌లో కానీ, ఫ్యామిలీలో కానీ.. సైఫ్ అలీఖాన్‌కు ఎవరితో అయినా విభేదాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేయనున్నారు. అయితే పోలీసులు విచారణ అనంతరం దీనిపై నిజానిజాలు తెలియాల్సి ఉంది.