BigTV English

Pushpa -2: సీక్రెట్ రివీల్ చేసిన బ్రహ్మాజీ.. వీడియోతో సహా..!

Pushpa -2: సీక్రెట్ రివీల్ చేసిన బ్రహ్మాజీ.. వీడియోతో సహా..!

Pushpa-2..ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. అందులో ఎక్కువ శాతం టాలీవుడ్ లోనే భారీ బడ్జెట్ తో చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు పట్టాలపై ఉన్న హై రేంజ్ సినిమాలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప -2 (Pushpa -2)చిత్రం కూడా ఒకటి. సుకుమార్ (Sukumar ) తెరకెక్కిస్తున్న ఈ సినిమా గతంలో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయిన పుష్ప – ది రైజ్ (Pushpa- The Rise) చిత్రానికి కొనసాగింపుగా వస్తోంది.


షూటింగ్ పూర్తి చేసుకున్న పుష్ప -2..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15వ తేదీని విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసినా.. మూవీ షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల డిసెంబర్ 6వ తేదీకి విడుదల వాయిదా వేశారు. అప్పటి నుంచి ఏ మాత్రం బ్రేకులు లేకుండా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నిన్నటితో షూటింగ్ కాస్త పూర్తి చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాకి టాకీ పార్ట్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా పుష్ప – ది రూల్ (Pushpa – The Rule)సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం చివరి షెడ్యూల్ ని కూడా వేగంగా జరుపుతూ వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా దీనిపై ప్రముఖ నటుడు బ్రహ్మాజీ (Brahmaji )కూడా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోని కూడా ఆయన షేర్ చేశారు.


సీక్రెట్ రివీల్ చేసిన బ్రహ్మాజీ..

తాజాగా ఈ పోస్టులో బ్రహ్మాజీ పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ పూర్తి అయిపోయిందంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆ వీడియోలో షూటింగ్ సెట్స్ లో తీసుకున్న కొన్ని ఫోటోలు కూడా ఆయన జోడించడం జరిగింది. ఇందులో పుష్ప -2 సినిమాలో నటిస్తున్న చాలామంది నటీనటులు, తెర వెనుక పని చేస్తున్న కొందరు టెక్నీషియన్లు కూడా కనిపించారు. అయితే అందరిలో ఒక నటుడు మాత్రం చాలా హైలైట్ అవుతున్నాడు ఆయనే బాలీవుడ్ ఫేమస్ యాక్టర్ సౌరభ్ సచ్ దేవ (Sourabh Sachdeva)..ఈ వీడియోలలో ఆయన కనిపించేసరికి ఇందులో ఈయన నటిస్తున్నారా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్ దేవ

గతంలో ఎన్నో చిత్రాలలో సౌరభ్ సచ్ దేవ నటించారు. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy vanga) దర్శకత్వం వహించిన యానిమల్ (Animal )చిత్రంలో కూడా ఈయన అబిద్ హక్ అనే పాత్రలో నటించారు. ఈ పాత్ర ఆయనకు మరింత ఇమేజ్ తెచ్చి పెట్టింది. అలాంటి ఈయన ఇప్పుడు పుష్ప – ది రూల్ లో నటిస్తున్నాడని తెలియడంతో అభిమానుల అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది అంటూ నటుడు బ్రహ్మాజీ చెప్పడంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. అదే సమయంలో అనసూయ (Anasuya ), టబు (Tabu ) వంటి వారితో పాటు చాలామంది ప్రముఖులు దీనికి కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సౌరభ్ నటిస్తున్నట్లు ఈ రహస్యాన్ని కాస్త రివీల్ చేయడంతో అంచనాలు మరింత పెరిగిపోతున్నాయని చెప్పాలి.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Actor Brahmaji (@brahms25)

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×