BigTV English
Advertisement

Pushpa 2 movie: చివరి షెడ్యూల్ మొదలు.. షూటింగ్లో పాల్గొనబోతున్న శేఖర్ మాస్టర్..!

Pushpa 2 movie: చివరి షెడ్యూల్ మొదలు.. షూటింగ్లో పాల్గొనబోతున్న శేఖర్ మాస్టర్..!

Pushpa 2 movie:బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమా కోసం బన్నీ అభిమానులే కాదు.. సినీ ప్రియులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప -2 (Pushpa -2)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న (Rashmika mandanna) హీరోయిన్ గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండగా.. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమాపై హైప్ పెంచుతూ.. నిన్న సాయంత్రం బీహార్ లోని పాట్నాలో ఉన్న గాంధీ మైదానంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడమే కాదు 24 గంటలు ముగియకముందే.. 100 మిలియన్ వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. ముఖ్యంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు ఏ సినిమా ట్రైలర్ కూడా ఈ రేంజ్ లో వ్యూస్ దక్కించుకోలేదు. 24 గంటల సమయం ముగిసేసరికి కచ్చితంగా 150 మిలియన్ వ్యూస్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.


చివరి షెడ్యూల్ ప్రారంభం..

ఇప్పటివరకు యూట్యూబ్ లో మహేష్ బాబు (Mahesh Babu) ‘గుంటూరు కారం’, ప్రభాస్(Prabhas )’సలార్’ ట్రైలర్లు మాత్రమే అత్యధికంగా వ్యూస్ సాధించిన ట్రైలర్స్ గా రికార్డు సృష్టించాయి. అయితే ఇప్పుడు ఈ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ దాదాపు మూడింతల రెట్టింపు రిజల్ట్స్ తో రికార్డు సృష్టించింది పుష్ప -2. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ తెరపైకి వచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో చివరి షెడ్యూల్ కూడా పూర్తి చేయనున్నారట చిత్ర బృందం. అందులో భాగంగానే నాలుగు రోజులపాటు జరిగే ఈ చివరి షెడ్యూల్ హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించబోతున్నట్లు తెలిసింది.


చివరి పాటకు కొరియోగ్రఫీ అందిస్తున్న శేఖర్ మాస్టర్..

ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక చివరి పాట మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో నాలుగు రోజులపాటు అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ పూర్తి చేయనున్నారట. ఈ సినిమాలోని పాటలకు కొరియోగ్రఫీ అందిస్తున్న శేఖర్ మాస్టర్ (Sekhar Master) చివరి పాటలో కూడా పాల్గొని ఫినిష్ చేయబోతున్నట్లు సమాచారం. సినిమా పనులు త్వరగా పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయబోతున్నారు. అలాగే ప్రమోషన్స్ జోరు పెంచబోతున్నారు చిత్ర బృందం. వాస్తవానికి ప్రమోషన్స్ ఎంత విస్తృతంగా చేస్తే సినిమా అంత వేగంగా ప్రజలలోకి వెళ్తుంది. అప్పుడే సినిమాకు హైప్ పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తానికి అయితే బన్నీ తన స్టామినాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారని స్పష్టం అవుతోంది.

పుష్ప -2 తారాగణం..

పుష్ప -2 సినిమా విషయానికి వస్తే.. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. అనసూయ, ఫహాద్ ఫాసిల్, జగపతిబాబు, తారక్ పొన్నప్ప, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×