Body Lotion: చర్మ సంరక్షణ కోసం మంచి బాడీ లోషన్‌ను ఉపయోగించడం చాలా ముఖ్యం. దీని ఉపయోగం చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కానీ ఇప్పటికీ బాడీ లోషన్ ఉపయోగించని వారు కూడా చాలా మందే ఉన్నారు. వీటిలోని పోషకాలు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. అంతే కాకుండా తగిన తేమను కూడా అందిస్తాయి. బాడీ లోషన్ యొక్క ప్రయోజనాల గురించి తెలిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు ఉపయోగించడానికి ఆసక్తి చూపుతారు. మరి బాడీ లోషన్ ప్రయోజనాల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది:
అనేక కారణాల వల్ల చర్మం తేమను కోల్పోతుంది. ఫలితంగా పొడిగా మారుతుంది. అంతే కాకుండా స్థితిస్థాపకత కోల్పోవడానికి దారితీస్తుంది. అటువంటి పరిస్థితిలో, చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి త్రాగునీటితో పాటు బాడీ లోషన్ ఉపయోగించడం చాలా ముఖ్యం. ఇది పొడి చర్మాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా శరీరానికి తేమను అందించి అందంగా మారుస్తుంది. ప్రతి రోజు బాడీ లోషన్ ఉపయోగించడం వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది.
2.చర్మం మృదువుగా మారుతుంది:
బాడీ లోషన్ ఉపయోగించని వారి చర్మం చాలా దృఢంగా మారుతుంది. అందుకే బాడీ లోషన్ ఉపయోగించడం అవసరం. బాడీ లోషన్‌ను ఉపయోగించడం ద్వారా చర్మాన్ని కోమలంగా మార్చుకోవచ్చు. అంతే కాకుండా ఇది చర్మాన్ని మృదువుగా తేమగా మార్చుతుంది. ప్రతి రోజు బాడీ లోషన్ అప్లై చేయడం వల్ల చర్మంపై జిడ్డు తొలగిపోతుంది. అంతే కాకుండా దుమ్ము, ధూళి కణాల నుంచి హాని కలగకుండా ఉంటుంది. చర్మం కోమలంగా మెరిసేలా ఉండటానికి బాడీ లోషన్ ఉపయోగించడం చాలా అవసరం.
3) చర్మ ఆరోగ్యం పెరుగుతుంది:
స్కిన్ హైడ్రేషన్‌ను ప్రోత్సహించడం . చర్మ స్థితిస్థాపకతను పెంచడం ద్వారా, బాడీ లోషన్‌లు చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. వీటి ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. తరుచుగా బాడీ లోషన్ ఉపయోగించే వారి యొక్క స్కిన్ చాలా అందంగా ఉంటుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
Also Read: మీ ముఖం చందమామలా మెరిసిపోవాలా ? అయితే ఇలా చేయండి
4) వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది:
యాంటీ ఏజింగ్ పదార్థాలతో కూడిన బాడీ లోషన్లను ఉపయోగించడం వల్ల ముడతలు, ఫైన్ లైన్లు , పిగ్మెంటేషన్ వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడుతుంది. స్కిన్ పొడిబారడం, మొటిమలు, తామర వంటి సమస్యలు ఉంటే, బాడీ లోషన్‌ను వాడండి.ఈ సమస్యను నయం చేయడంలో బాడీ లోషన్ సహాయపడుతుంది.
5) మంచి సువాసన:
సువాసనతో కూడిన మృదువైన , క్రీములు, బాడీ లోషన్ లు మీ చర్మానికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. వీటి సువాసన కూడా మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఫ్రెష్ భావనను కలిగిస్తుంది. అందుకే తప్పకుండా బాడీ లోషన్ వాడటం అలవాటు చేసుకోవాలి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.