Ram Charan: ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన చాలా మందికి సినిమా అనేది ఏకైక ఎంటర్టైన్మెంట్. థియేటర్ కెళ్ళి సినిమా చూడటం అనేది ఒక రకమైన కొత్త ఫీలింగ్. ఇప్పుడు సినిమా కోసం థియేటర్ కి వెళ్లే ఆడియన్స్ తగ్గిపోయారు. కానీ ఒకప్పుడు పెద్ద సినిమాకి టికెట్ దొరకాలంటేనే గగనం. టికెట్ల కోసం చాలామంది రాజకీయ నాయకులకి, పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి టికెట్లు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు కొన్ని యాప్స్ వలన ఆన్లైన్లో ఇంట్లో కూర్చుని సినిమా టికెట్లు బుక్ చేసుకుంటున్నాం. ఇకపోతే ఒక పెద్ద హీరో సినిమా వస్తుంది అంటే ఈ రోజుల్లో ఒకటి రెండు రోజులు మాత్రమే థియేటర్స్ ఫుల్ గా ఉంటాయి. ఆ తర్వాత ఖాళీగా మారిపోతుంటాయి. ఓటీటీ వచ్చిన తర్వాత చాలామంది ఆడియన్స్ థియేటర్లో సినిమాలు చూడడం మానేశారు. అది ఒక పెద్ద సినిమా అయితే కానీ థియేటర్ వరకు ప్రేక్షకులు రావడం లేదు.
ఇకపోతే ప్రతి హీరోకి కొంతమంది అభిమానులు ఉంటారు. టికెట్ ధర ఎంత ఉన్నా కూడా మొదటి రోజు చూడడానికి ఫిక్స్ అవుతారు. అలానే హౌస్ ఫుల్ థియేటర్లో సినిమా చూడటం అనేది ఒక అనుభూతి ఫీల్ అవుతారు. కొన్ని సందర్భాలలో థియేటర్ వద్ద ఊహించిన పరిణామాలు జరుగుతుంటాయి. రీసెంట్గా పుష్ప సినిమా విషయంలో అదే జరిగింది. ఎంతో ఆస్తు సినిమా చూడడానికి వెళ్లారు సాధారణ కుటుంబ సభ్యులు. అయితే అక్కడికి అల్లు అర్జున్ రావడం వలన తొక్కిసలాట జరిగి తల్లి బిడ్డ ప్రాణాలు కోల్పోయారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు బట్టి అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నట్లు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అని తెలుస్తుంది. ఏదేమైనా అభిమానుల విషయంలో హీరోలు కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొని ఉండాలని ఖచ్చితంగా చెప్పాలి. ఈ విషయంలో చాలామంది హీరోలు రామ్ చరణ్ తేజ్ ను చూసి నేర్చుకోవాలి.
చిరుత సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చరణ్. తనకంటూ ఒక ప్రత్యేకమైన సొంత గుర్తింపును సాధించుకున్నాడు. దీనికి కేవలం చరణ్ చేసిన హిట్ సినిమాలు మాత్రమే కాదు చరణ్ క్యారెక్టర్ కూడా చాలా పెద్ద ప్లస్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా చరణ్ ప్రేక్షకులను అభిమానులను కేర్ చేసే విధానం చాలామందికి నచ్చుతుంది. గతంలో బోయపాటి శ్రీను మాట్లాడుతూ మనం సినిమా ఫంక్షన్ చేస్తే తొమ్మిది గంటలకు అయిపోయేటట్లు ప్లాన్ చేయండి. ఎక్కడెక్కడ నుంచో అభిమానులు వస్తారు వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి వెళ్లి పోవాలి అంటూ చెప్పుకొచ్చారు. మరో సందర్భంలో ఎస్ ఎస్ రాజమౌళి మాట్లాడుతూ తను క్రౌడ్ లో ఉన్నప్పుడు తనను చాలామంది లాగుతుంటారు మరోవైపు నుంచి పీకుతుంటారు. కానీ ఆయన మాత్రం చాలా ఓపిగ్గా ఉంటాడు అంటూ రాంచరణ్ ఉద్దేశిస్తూ చెప్పుకొచ్చాడు. అలానే పుష్ప సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన జర్నలిస్టు దేవీ నాగవల్లి కూడా ఒక సందర్భంలో రామ్ చరణ్ క్రౌడ్ లో చిక్కుకుపోతున్న తనను ప్రొటెక్ట్ చేశారు అంటూ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ ను చూసి చాలామంది హీరోలు నేర్చుకోవాలి అంటూ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.
Also Read : Pushpa 2 Movie Sandhya Theatre Incident : మరణానికి కొన్ని నిమిషాలు ముందు రేవతి వీడియో