Pushpa2 : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2.. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. డిసెంబర్ 5 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది. నవంబరు 20 నాటికి తొలి కాపీ సిద్ధమైపోవాలన్నది నిర్మాతల టార్గెట్. అయితే అది సాధ్యం కాలేదు. ఈరోజు కూడా ‘పుష్ప 2’కి సంబంధించిన ప్యాచ్ వర్క్ జరుగుతూనే ఉంది. ఇంకా కొంతవరకు షూటింగ్ పెండింగ్ ఉందని ఓ వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది. ఇప్పుడు షూటింగ్ ను పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఇక ప్రమోషన్స్ కు కొబ్బరికాయ కొట్టేశారని టాక్ నడుస్తుంది. ఇప్పటికే ట్రైలర్ లాంచ్ కోసం భారీగా ప్రమోషన్స్ చేశారు.. ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కోసం కూడా భారీగా ఖర్చు చెయ్యనున్నారని టాక్..
ఇక ఈ సినిమా ఈవెంట్ ను మొదటగా కొచ్చిలో ఈవెంట్ ఉందనే వార్తలు వినిపించాయి. ఇందుకు సంబంధించిన పోలీసుల అనుమతులు కూడా వచ్చేసిందని తెలుస్తోంది. యూసుఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ జరిగే ఛాన్స్ వుంది. దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ అస్తవ్యస్తమైన నేపథ్యంలో ఈ ఈవెంట్ పకడ్బందీగా నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఈవెంట్ కు ఎలాంటి అవాంతరాలకూ చోటు ఇవ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ ఈవెంట్ అయిన తరవాత బెంగళూరులో మరో ప్రమోషన్ కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత ముంబైలోనూ ఓ ప్రెస్ మీట్ నిర్వహిస్తారని తెలుస్తోంది. దాంతో ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తవుతాయి. ఇక సోషల్ మీడియా ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు.
అల్లు అర్జున్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఎదో ఇంటర్వ్యూలు ఇవ్వడం కామన్. ఒక్క అల్లు అర్జున్ మాత్రమే కాదు. ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ అదే చేస్తున్నారు. ఇప్పుడు బన్నీ కూడా ఇదే పంథా పాటిస్తాడా, లేదంటే మీడియాతో మాట్లాడతాడా? అనేది ఆసక్తిగా మారింది. సుకుమార్ అయితే.. సినిమా రిలీజ్ అయ్యేంత వరకూ మీడియా ముందుకు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్స్ లో ఆయన అంత బిజీగా ఉన్నారు.. అంటే ఇక అల్లు అర్జున్, రష్మిక మందన్న మాత్రమే ఈ ప్రమోషన్స్ ను చూసుకోవాలి.. ఇక విడుదలకు కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో టీమ్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. ఈ సినిమాకు దాదాపుగా రూ. 500 కోట్లు ఖర్చు చేసారని టాక్. ఇక ప్రమోషన్స్ కు కూడా భారీగా ఖర్చు చేస్తున్నారని టాక్..
ఇక ఇప్పటివరకు పుష్ప 2 నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. నిన్న విడుదలైన ఐటమ్ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఇక సినిమా ఎలాంటి రికార్డులు కొల్లగొట్టేస్తుందో చూడాలి.. గతంలో వచ్చిన పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ రికార్డులను బ్రేక్ చేసి ఐకాన్ స్టార్ అయ్యాడు బన్నీ ఇప్పుడు ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తాడో అనేది ఆసక్తిగా మారింది.