Satya Dev : కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది టాలెంటెడ్ దర్శకులు ఉన్నారు. ఒకప్పుడు ఇతర భాషల్లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలను కొంతమంది తెలుగు దర్శకులు తెలుగు హీరోలతో రీమేక్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాకుండా చాలామంది తెలుగు దర్శకులు మిగతా ఇండస్ట్రీ హీరోలతో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అలానే మిగతా ఇండస్ట్రీలో దర్శకులు కూడా తెలుగు హీరోలతో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఇక రీసెంట్ గా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో సత్యదేవ్ నటించిన సినిమా జీబ్రా. నవంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ సాధించుకుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా మౌత్ టాక్ తో ముందుకు వెళుతున్న తరుణంలో ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్.
Also Read : Satya: ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ లో బరిలోకి దిగిన సాయి దుర్గ తేజ్ ‘సత్య’..!
ఈ సక్సెస్ ఈవెంట్లో సత్యదేవ్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ గురించి తెలిపాడు. మామూలుగా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు అందరికీ నచ్చాలి అని రూల్ లేదు. కొన్నిసార్లు సినిమా నచ్చకపోయినప్పుడు ఎందుకు నచ్చలేదు అని చిత్ర యూనిట్ ఆత్మ పరిశీలన చేసుకుంటుంది కూడా, అలానే అన్ని రివ్యూస్ ని కూడా చదువుతుంటారు కొన్నిసార్లు. అయితే ఒక రివ్యూ చదివిన తరుణంలో తెలుగు డైరెక్టర్ అయితే ఈ సినిమాను ఇంకా బాగా తీసేవాడు అంటూ ఎక్కడో ఒక మాట చదివాడు హీరో సత్యదేవ్.ఆ మాట గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. ఆ మాట తను చదవగానే బాధ కలిగించింది అంటూ చెప్పుకొచ్చాడు. తెలుగు దర్శకుడు కాకపోయినా కూడా కనీసం హైదరాబాద్ నుంచి చెన్నైకి 500 సార్లు తిరిగి ఉంటాడు. దీనికి చాలా ఖర్చవుతుంది. తెలుగు నేర్చుకుని కూడా ఈ సినిమా కోసం బాగా పనిచేశాడు. ఈయన ఫ్లైట్ టికెట్లకి పెట్టిన ఖర్చుతో ఒక ఇల్లు కొనుక్కోవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : RC16 : ఇది మామూలు ప్లానింగ్ కాదు, రామ్ చరణ్ పక్కన మున్నాభాయ్.?
ఇకపోతే బ్లఫ్ మాస్టర్ అనే సినిమా తర్వాత ఆ స్థాయిలో ఆడిన సినిమా ఇప్పటివరకు సత్యదేవ్ కెరియర్ లో లేదు. అందుకే ఈ సినిమా విషయంలో బ్లఫ్ మాస్టర్ కి జరిగినట్లు జరగకుండా, ఈ సినిమా హిట్టుని పదిమందితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది చిత్ర యూనిట్. ఒక మంచి సినిమాకి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మంచి రెస్పాన్స్ ఇస్తారు అని ప్రతిసారి ప్రూవ్ చేస్తూనే ఉంటారు. ఇక కేవలం హీరోగానే కాకుండా కొన్ని సినిమాల్లో కీలక పాత్రలలో కూడా కనిపిస్తున్నాడు హీరో సత్యదేవ్. ముఖ్యంగా చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాల్లో విలన్ పాత్రలో కనిపించి మంచి గుర్తింపును సాధించుకున్నాడు.