Pushpa 2 The Rule : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో పుష్ప 2 ఒకటి. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇదివరకే రిలీజ్ అయిన పుష్ప సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది ప్రముఖులు ఈ సినిమాలోని డైలాగ్స్ ను మ్యానరిజమ్స్ విపరీతంగా వాడారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఈ సినిమాకు సంబంధించి చాలా రీల్స్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో సారథి స్టూడియోలో కీలక సీన్స్ తీస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఐటెం సాంగ్ షూటింగ్ కూడా పూర్తయిపోయినట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి ఇంకా ప్యాచ్ వర్క్ మాత్రమే ఉంది. ఈ నెల 18 నుండి డ్యూయెట్ సాంగ్ తీస్తారు. ఈ సినిమా ట్రైలర్ 17వ తారీఖున రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా మీద అంచనాలు మరింత ఎక్కువ కానున్నాయి. ఈ సినిమా మీద చిత్ర యూనిట్ కూడా విపరీతమైన నమ్మకంతో ఉంది. ఈ సినిమాలో జాతర సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అంటూ ఇదివరకే నిర్మాతలు కూడా తెలిపారు. అలానే ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా క్లైమాక్స్ ఉండబోతుంది అని చిత్ర యూనిట్ చెప్పుకొస్తుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది కాబట్టి అల్లు అర్జున్ నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా అదే రేంజ్ లో రిలీజ్ కానుంది.
Also Read : Ramya Krishnan: సౌందర్యతో ఆ సీన్ ఇష్టం లేకపోయినా చేశా.. ముఖంపై కాలు పెట్టి మరీ..
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. త్రివిక్రమ్ తన కెరియర్ లో ఎక్కువమంది స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. ఇప్పటివరకు త్రివిక్రమ్ ఒక పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. ఇక అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేయబోయే సినిమా గురించి అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు రాజమౌళి,సుకుమార్ వంటి దర్శకులు ప్రపంచవ్యాప్తంగా తమ సత్తా తెలిసేలా చేశారు. ఇప్పుడు త్రివిక్రమ్ వంతు రాబోతుంది. త్రివిక్రమ్ కెరియర్ స్టార్టింగ్ లోనే హాలీవుడ్ సినిమాలను ఇన్స్పైర్ అవుతూ ఎన్నో సీన్స్ ను తన సినిమాల్లో చూపించేవాళ్ళు. ఇప్పుడు హాలీవుడ్ ని కూడా మెప్పించే రేంజ్ లో త్రివిక్రమ్ సినిమా చేస్తాడా అంటూ చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.