Ramya Krishnan: అందం, అభినయం కలగలిపిన నటీమణుల్లో రమ్యకృష్ణ ఒకరు. పాత్ర ఎలాంటిదైనా ఆమె వద్దకు వచ్చేవరకే.. ఒక్కసారి ఆమె ఓకే అనిందా.. ? సినిమా హిట్ అవ్వాల్సిందే. హీరోయిన్, విలన్, సపోర్టివ్ రోల్.. ఏదైనా సరే తన నటనతో ప్రేక్షకులను అలరించగల సామర్థ్యం ఉన్న నటి రమ్యకృష్ణ. కెరీర్ మొదట్లో ప్లాపులు ఎదుర్కొంది. ఐరెన్ లెగ్ అనిపించుకుంది. కానీ, ఆ తరువాత ఆమెను వద్దు అనుకున్నవారే .. ఆమెను ఏరికోరి సినిమాల్లోకి తీసుకున్నారు.
ఇక రమ్యకృష్ణ కెరీర్ మొత్తంలో గుర్తుండిపోయే పాత్ర ఏదైనా ఉంది అంటే అది నీలాంబరి అని చెప్పాలి. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ అందం, అభినయం, పొగరు, తెలివి, బాధ, విరహం, కోరిక.. ఇలాంటివన్నీ ఆ పాత్రలో చూపించింది. ఒక అమ్మాయి పొగరు ఉండాలి కానీ.. నీలాంబరిలా ఉండకూడదు అని ఇప్పటికీ పెద్దవాళ్ళు పోలుస్తునే ఉంటారు. ఆ ఒక్క క్యారెక్టర్.. రమ్యకృష్ణను ప్రేక్షకుల మదిలో నుంచి బయటకు పోకుండా చేసింది.
Kanguva Disaster: రూ. 2000 కోట్లు అంటివి కదరా.. ఎక్కడ ఉన్నావ్ రాజా
ఇక నరసింహ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు రమ్యకృష్ణను ఎలా గుర్తుపెట్టుకుంటామో.. అందాల ముద్దుగుమ్మ సౌందర్యను కూడా అలాగే గుర్తుతెచ్చుకుంటం. అందం, అణుకువ, అభినయం కలగలిపిన రూపం సౌందర్య. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను రమ్యకృష్ణ ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది. రవి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజినీకాంత్ హీరోగా నటించాడు. రమ్యకృష్ణ విలన్, సౌందర్య హీరోయిన్ గా కనిపించింది. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. నీలాంబరి..నరసింహాను ప్రేమిస్తుంది.. నరసింహా వసుంధరను ప్రేమిస్తాడు.
నీలాంబరి పెద్దింటి కుమార్తె.. వాళ్ళింట్లో పనిచేసే అమ్మాయి వసుంధర. ఈ సినిమాలో ఆ బేధాలను చాలా చక్కగా చూపించాడు రవికుమార్. అమెరికా నుంచి వచ్చిన నీలాంబరి, పనివారిని ఎంత చులకనగా చూస్తుంది. తాను కోరుకున్న మగవాడు.. పనిమనిషిని ప్రేమిస్తున్నాడు అని తెలిసి.. ఆమెను ఎంత అవమానిస్తుంది అనేది అద్భుతంగా చూపించాడు. ఇక ఒక సీన్ లో సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలు పెట్టి.. తనను అవమానిస్తుంది. ఆ సీన్ చేయనని రమ్యకృష్ణ ముఖంమీదనే చెప్పేసిందట.
Sravanthi Chokarapu: హాస్పిటల్ బెడ్ పై హాట్ యాంకర్.. బ్లీడింగ్ ఆగడం లేదంటూ..
” సౌందర్య అప్పటికే పెద్ద హీరోయిన్. అది కాక నాకు మంచి స్నేహితురాలు. పక్కనే రజినీకాంత్ గారు ఉన్నారు. నాకు భయమేసింది. నేను చేయను అని చెప్పాను. డైరెక్టర్ ఏం పర్లేదు చేయమని చెప్పారు. అప్పుడు సౌందర్య కూడా ఏం కాదు.. సీన్ కదా.. చేయ్ అని ఎంకరేజ్ చేసింది. తనే నా కాలును తీసి భుజంపై పెట్టుకొని ఆ సీన్ ను పూర్తిచేసింది. ఇష్టంలేకపోయినా సౌందర్యంతో ఆ సీన్ చేయాల్సి వచ్చిందని” చెప్పుకొచ్చింది. ఎంతైనా అప్పుడు ఉన్న హీరోయిన్స్ డెడికేషన్ అలాంటింది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.