BigTV English

Srinivasa Murthy: ఆయన లేని లోటు కంగువ సినిమాలో ప్రతిసారి కనిపించింది

Srinivasa Murthy: ఆయన లేని లోటు కంగువ సినిమాలో ప్రతిసారి కనిపించింది

Srinivasa Murthy: కేవలం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సూర్యకి ఎంత మంచి క్రేజ్ ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య చేసిన ఎన్నో సినిమాలు ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక మంచి సినిమా ఏ భాషలో ఉన్నా కూడా దానిని ఎంకరేజ్ చేయడం అనేది తెలుగు ప్రేక్షకులు ఎప్పటినుంచో అలవాటు చేసుకున్నారు. చాలామంది తమిళ్ హీరోస్ ను తెలుగు ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆదరిస్తూ వస్తున్నారు. రజనీకాంత్, కమలహాసన్, విక్రమ్, సూర్య, విశాల్ వంటి హీరోల డబ్బింగ్ సినిమాలు ఇక్కడ ఎంతగానో మంచి ఆదరణను సాధించాయి.


సూర్య నటించిన నువ్వు నేను ప్రేమ, శివపుత్రుడు, గజిని, ఆరు వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాలలో ప్రేక్షకులను ఆకట్టుకునేది వాయిస్. ఇక సూర్య విషయానికి వస్తే సూర్య ఎక్కువ శాతం సినిమాలకి శ్రీనివాసమూర్తి డబ్బింగ్ చెప్పేవాళ్ళు. సూర్యను చూస్తే ఆటోమేటిక్ గా ఆ వాయిస్ వినిపించేది. కొన్నేళ్ల క్రితం శ్రీనివాసమూర్తి కాలం చేశారు. ఆ తరువాత సూర్య సినిమాలకు డబ్బింగ్ చెప్పే పర్సన్స్ లేకపోయారు. సుధా కొంగర దర్శకత్వంలో ఆకాశమే హద్దురా సినిమాకి సత్యదేవ్ డబ్బింగ్ చెప్పాడు. సినిమా అద్భుతంగా ఉన్నా కూడా సత్యదేవ్ వాయిస్ సూర్యకి సెట్ కాలేదు అని చాలామంది అప్పట్లో కామెంట్ కూడా చేశారు. ఇక రీసెంట్ గా కంగువ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు సూర్య. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంటుంది.

Also Read :  Puri Jagannath: తల్లిదండ్రులే పెద్ద క్రిమినల్స్.. వారిని రేప్ చేస్తున్నారు


వాస్తవానికి ఈ సినిమా పైన ఎన్నో అంచనాలను క్రియేట్ చేశాడు నిర్మాత జ్ఞానవేల్ రాజా. ఈ సినిమాను తమిళ్ బాహుబలి అంటూ ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు. అలానే చాలాచోట్ల ఈ సినిమా 2000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఈ సినిమా కథ, సన్నివేశాలు పక్కన పెడితే ఎప్పుడూ సూర్యకి డబ్బింగ్ చెప్పే శ్రీనివాసమూర్తి లేకపోవడం అనేది ఈ సినిమాలో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఎందుకు అరుస్తున్నాయో ఎవరికీ అర్థం కాలేదు. అలానే ఎప్పటినుంచో శ్రీనివాసమూర్తి వాయిస్ కి అలవాటు పడిపోయిన ప్రేక్షకులు ఇక ప్రస్తుతం సూర్య వాయిస్ కి అంతగా కనెక్ట్ అవ్వలేకపోయారు. ఈ సినిమాకి సంబంధించి సూర్య వాయిస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చెప్పించారంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమాకి పార్ట్ 2 కూడా చేయాల్సిన అవసరం లేదు అనేది కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×