BigTV English

Pushpa 2 Ticket Bookings: టాప్ 10 టికెట్ బుకింగ్స్… ఈ సినిమాలను పుష్ప రాజ్ క్రాస్ చేస్తాడా?

Pushpa 2 Ticket Bookings: టాప్ 10 టికెట్ బుకింగ్స్… ఈ సినిమాలను పుష్ప రాజ్ క్రాస్ చేస్తాడా?

Pushpa 2 Ticket Bookings: పెద్ద సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందంటే చాలు.. అప్పుడే ప్రేక్షకులు బుక్ మై షో లో టికెట్స్ బుక్ చేసుకుని, మొదటి రోజు మొదటి షో చూడడానికి తెగ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇకపోతే ఇప్పటివరకు విడుదలైన పెద్ద చిత్రాలు బుక్ మై షో లో భారీ రికార్డ్స్ క్రియేట్ చేశాయి. 2024 సంవత్సరానికి గానూ అత్యధికంగా టికెట్స్ అమ్ముడుపోయిన చిత్రాల జాబితాను బుక్ మై షో విడుదల చేసింది. మరి ఆ రికార్డును ‘పుష్ప -2’ బ్రేక్ చేస్తుందో లేదో తెలియాల్సి వుంది. అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా, రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా ‘పుష్ప’ సీక్వెల్ గా వస్తున్న చిత్రం పుష్ప 2. ఈ చిత్రానికి సుకుమార్ (Sukumar)దర్శకత్వం వహిస్తూ ఉండగా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు..


బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ‘గంగమ్మ జాతర’ సన్నివేశం సినిమాకే హైలెట్ కానుంది. ఈ సన్నివేశంలో అల్లు అర్జున్ మొదటిసారి అమ్మవారి గెటప్ ధరించనున్నారు. ఇప్పటికే ఈ లుక్ కి సంబంధించిన పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చాలా హైప్ పెరిగిపోయింది. దీనికి తోడు ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తూ.. సినిమాపై అంచనాలు పెంచేశారు చిత్ర బృందం. హై ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న ఈ సినిమాకి “బుక్ మై షో” లో ఎన్ని టికెట్లు అమ్ముడుపోతాయో తెలియదు కానీ ప్రస్తుతం ఈ సినిమా ట్రెండింగ్లో ఉంది అని చెప్పవచ్చు.

ఇకపోతే ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో.. బుక్ మై షో లో అత్యధికంగా టికెట్స్ అమ్ముడుపోయిన టాప్ టెన్ చిత్రాల జాబితా ఒకటి వైరల్ అవుతోంది.. మరి ఆ జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం.


1.కల్కి 2898AD:
ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin)దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై వచ్చిన చిత్రం ‘కల్కి 2898AD’. రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas ), దీపికా పదుకొనే(Deepika Padukone), కమల్ హాసన్(Kamal Hassan), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) , రాజేంద్రప్రసాద్(Rajendra Prasad)వంటి భారీతారాగణం నటించిన ఈ చిత్రం ఊహించని కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాకి బుక్ మై షో లో 13.14 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.

2. స్త్రీ 2:
అమర్ కౌశిక్(Amar kaushik)దర్శకత్వంలో శ్రద్ధ కపూర్(Shraddha Kapoor)లీడ్ రోల్ పోషిస్తూ తెరకెక్కిన చిత్రం ‘స్త్రీ 2’. పివిఆర్ ఐనాక్స్ పిక్చర్స్, పెన్ స్టూడియో బ్యానర్లపై దినేష్ విజన్, జ్యోతి దేశ్ పాండే సుమారుగా రూ.120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమాకి బుక్ మై షోలో 11.40 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయి.

3. అమరన్:
స్వర్గీయ మేజర్ ముకుంద్ వరదరాజన్(Mukundh Varadarajan)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అమరన్’. జీ.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు. శివ కార్తికేయన్(Shiva Karthikeyan), సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో..భారీ అంచనాల మధ్య అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకి బుక్ మై షో లో 4.81 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయి.

4. దేవర:
కొరటాల శివ(Koratala shiva) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)నటించిన చిత్రం ‘దేవర’. సెప్టెంబర్ 27వ తేదీన పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి బుక్ మై షో లో 4.80 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయి.

5. హనుమాన్:
యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja)హీరోగా , ప్రశాంత్ వర్మ (Prashanth Varma)దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది. 4.72మిలియన్ టికెట్స్ బుక్ మై షో లో బుక్ అయ్యాయి.

6. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (ది గోట్):
వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay thalapathy) హీరోగా సెప్టెంబర్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకి బుక్ మై షోలో 4.51 మిలియన్ టికెట్స్ బుక్ అయ్యాయి.

7. భూల్ భులయ్య 3:కార్తీక్ ఆర్యన్(Karthik Aryan), త్రిప్తి డిమ్రి (Tripti dimri), విద్యాబాలన్ (Vidhyabalan), మాధురి దీక్షిత్(Madhuri Dixit) తదితరులు కీలకపాత్రలు పోషించిన చిత్రం ఇది. కేవలం రూ.150 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా రూ.411 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమాకి బుక్ మై షో లో 4.48 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయి.

8. మంజుమ్మెల్ బాయ్స్:
మలయాళం ఇండస్ట్రీ నుండి చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అటు అన్ని భాషలలో కూడా విపరీతమైన రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమాకి 4.30 మిలియన్ టికెట్స్ బుక్ అయ్యాయి.

9. ఫైటర్:
హృతిక్ రోషన్(Hrithik Roshan), దీపికా పదుకొనే(Deepika Padukone), అనిల్ కపూర్ (Anil Kapoor) కీలక పాత్ర పోషించిన చిత్రం ఇది. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఇక ఈ సినిమాకి బుక్ మై షో లో 3.68 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయి.

10. సింగం ఎగైన్:
అజయ్ దేవగన్ (Ajay Devgan)కీలక పాత్ర పోషించిన ఈ సినిమా నవంబర్ 1న బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకి బుక్ మై షో లో 3.67 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయి.

ఇక ఈ పది చిత్రాల రికార్డ్స్ ను బ్రేక్ చేయగలిగితేనే పుష్ప-2 నంబర్ వన్ స్థానాన్ని చేరుకుంటుంది. మరి పుష్ప 2 సినిమాకి ఏ స్థానం లభిస్తుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×