Rohit Sharma Son Name: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే రెండోసారి తండ్రి అయ్యాడు టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మకు ( Rohit Sharma) మొదటగా కూతురు పుట్టగా… ఇటీవల కొడుకు కూడా పుట్టాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma) అలాగే ఆయన భార్య రితిక.. తాజాగా కీలక ప్రకటన చేశారు. తమ కొడుకుకు నామకరణం చేశారు.
Also Read: WTC Final Race – Australia: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్…WTC రేసు నుంచి ఔట్ ?
అహాన్ శర్మ ( ahan sharma) అనే పేరును టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొడుకుకు పెట్టారు రితిక. ఈ మేరకు రోహిత్ శర్మ సతీమణి రితిక తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది. డిసెంబర్ నెల వచ్చేసింది అంటూ క్రిస్మస్ శాంటా గెటప్ లో ఉన్న…ఓ ఫ్యామిలీ ఫోటోను కూడా.. పోస్ట్ చేశారు రితిక. అందులోనే.. ఆహన్ శర్మ అనే నామకరణాన్ని చేశారు. ఇక సోషల్ మీడియాలో పెట్టిన ఆ పోస్టర్ లో ఉన్న బొమ్మలకు రితిక, రోహిత్ శర్మ, సమ్మీ, ఆహాన్ అనే పేర్లు కూడా పెట్టారు.
Also Read: Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ విషయంలో ICC కీలక నిర్ణయం.. అక్కడే మ్యాచులు !
ఇది ఇలా ఉండగా… గత 20 రోజుల కిందట రోహిత్ శర్మ భార్య రితిక ( ritika ) రెండోసారి తల్లి అయ్యారు. తనకు కొడుకు పుట్టడంతో ఆస్ట్రేలియాతో జరిగే…మొదటి టెస్ట్ కు దూరమయ్యాడు రోహిత్ శర్మ. ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవంగా ఈ టోర్నమెంట్ కు మొత్తానికి కెప్టెన్గా రోహిత్ శర్మ ఉండాలి.
కానీ తన ఫ్యామిలీలో సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో.. మ్యాచ్ కు దూరంగా ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి పర్మిషన్ తీసుకున్నాడు రోహిత్ శర్మ. దీనికి బిసిసిఐ అధికారులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ తరుణంలోనే మొదటి టెస్ట్ కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ తన కుటుంబంతో గడిపాడు. ప్రస్తుతం రెండో టెస్టుకు రెడీ అవుతున్నాడు రోహిత్ శర్మ. అడిలైడ్ వేదికగా జరిగే రెండవ టెస్ట్ కు కెప్టెన్ గారు రోహిత్ శర్మ ( Rohit Sharma) ఉండబోతున్నాడు.
ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ లో భాగంగా మొన్న ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగగా… టీమిండియా విజయాన్ని సాధించింది. అయితే.. రోహిత్ శర్మ లేకుండా కూడా… టీమిండియా విజయాన్ని నమోదు చేసుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ మొదటి టెస్ట్ మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరం కావడంతో.. కెప్టెన్సీ జస్ప్రీత్ బుమ్రాకు ( Bumrah) ఇచ్చారు. దీంతో… బుమ్రా ( Bumrah) కెప్టెన్సీలోనే టీమ్ ఇండియా బరిలోకి దిగి సక్సెస్ అయింది.