BigTV English
Advertisement

Pushpa 2 movie : శ్రీవల్లిని చంపేస్తారా…. ట్రైలర్లో ఈ సీన్ కి అర్ధం అదేనా?

Pushpa 2 movie : శ్రీవల్లిని చంపేస్తారా…. ట్రైలర్లో ఈ సీన్ కి అర్ధం అదేనా?

Pushpa 2 movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, రష్మిక మందన్న (Rashmika mandanna) హీరోయిన్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప -2. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా సినిమాని చిత్రీకరించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ ట్రైలర్ లాంచ్ చేశారు. బీహార్లోని పాట్నాలో చాలా గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి, ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది.


ట్రైలర్ లో ఎర్రచందనంతో అంత్యక్రియలు..

ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు. సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టర్ ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుందో, శ్రీవల్లి క్యారెక్టర్ కూడా అంతే ఆకట్టుకుంది. మొదటిసారి డీ గ్లామరస్ పాత్రలో నటించి పుష్ప సినిమాలో అదరగొట్టేసింది రష్మిక మందన్న. మొదటి పార్ట్ లో పుష్ప గాడి గర్ల్ ఫ్రెండ్ గా కనిపించిన శ్రీవల్లి.. ఇప్పుడు భార్యగా కనిపించి ఆకట్టుకోబోతోంది. ఇదిలా ఉండగా ట్రైలర్లో ఒక షాట్ లో ఎర్రచందనంతో అంత్యక్రియలు చేయడం చూపించారు. ఈ సీన్ కి అర్థం అదేనా అంటూ ఒక వార్తను తెరపైకి తీసుకువచ్చారు నెటిజెన్స్.


శ్రీవల్లి చనిపోతుందా..?

అసలు విషయంలోకెళితే.. పుష్ప -2 సినిమా మొదలుపెట్టినప్పుడు, ఈ సినిమాలో శ్రీవల్లి చనిపోతుందా? అంటూ ఒక ప్రశ్న లేవనెత్తారు. దీనిపై ఎవరూ కూడా నోరు మెదపలేదు. కానీ ట్రైలర్లో ఎర్రచందనంతో అంత్యక్రియలు చేసినట్లు చూపించారు. ముఖ్యంగా ఎర్రచందనం కింగ్ అయిన పుష్పరాజ్ తన భార్య శ్రీ వల్లి శవాన్ని ఎర్రచందనంతో కాలుస్తున్నట్లు ట్రైలర్లో చూపించారు అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నది శ్రీవల్లినా? లేక పుష్పరాజ్ తల్లా.. ? లేక పుష్పరాజ్ కి కావలసిన వ్యక్తా?అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

శ్రీవల్లిని టార్గెట్ చేసిన విలన్స్..

ఇకపోతే ఈ ట్రైలర్ చూసిన తర్వాత వినిపిస్తున్న వార్తలు విషయానికి వస్తే. విలన్స్ పుష్పరాజ్ ను ఏమి చేయలేక శ్రీవల్లిని చంపేస్తారట. ఇక అప్పటినుంచి మూవీ టర్న్ అవుతుందని, పుష్ప అందరిని చంపేస్తాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ఇలా రూమర్స్ వినిపిస్తున్నాయి కానీ ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

సస్పెన్స్ క్రియేట్ చేసిన ట్రైలర్..

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఈ ట్రైలర్ లో అల్లు అర్జున్ గెటప్ చాలా సరికొత్తగా కనిపించింది. మునుపెన్నడు లేని విధంగా అల్లు అర్జున్ తొలిసారి లేడీ గెటప్ లో ఆకట్టుకున్నారు. అలాగే ఫహాద్ ఫాజిల్ విలన్ గా మరోసారి తన మార్క్ చూపించబోతున్నారు.అనసూయ , సునీల్ క్యారెక్టర్లు కూడా ప్రేక్షకులను మెప్పించనున్నాయి. ఇకపోతే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో మెయిన్ విలన్ అనసూయ అంటూ వార్తలు వినిపిస్తున్నా. ఈ విషయం తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. అంతే కాదు పుష్ప -3 కూడా ఉంటుందట. మరి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకాలి అంటే డిసెంబర్ 5 వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×