BRS Venkateshwarlu: ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే. నమ్మిన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడిచే నాయకుడు. అటువంటి నాయకుడు ఒక్కసారిగా పార్టీపై తిరుగుబావుటా ఎగురవేశారు. తనకు సరియైన గు mర్తింపు ఇవ్వడం లేదంటూనే, పార్టీ జిల్లా అధ్యక్షుడిపై రుసరుసలాడారు. ఆయనెవరో కాదు బీఆర్ఎస్ కు చెందిన అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు.
ఈ సందర్భంగా బిగ్ టీవీతో తాను ఎదుర్కొంటున్న అవమానాలపై మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు గళమెత్తారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి వీర విధేయుడుగా ఉన్న తన పట్ల, పార్టీ నాయకత్వం పట్టించుకోని తీరులో వ్యవహరిస్తుందన్నారు. బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు, మాజీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు లు తమ వైఖరి మార్చుకోకుంటే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందంటూ ఆయన ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో జరిగే ఏ కార్యక్రమానికి కూడా తనకు కనీసం సమాచారం ఇవ్వడం లేదంటూ తాటి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సముచిత గౌరవం లేకుంటే పార్టీలో కొనసాగడం ఇక కష్టమంటూ ఆయన హెచ్చరించడం విశేషం.
మాజీ ఎమ్మెల్యే గా ఉన్న తనను పిలవకుండా పార్టీ నాయకత్వం, కార్యకర్తలకు సమాచారం అందించి క్షేత్రస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయడం ఎంతవరకు సబబన్నారు. తాను ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించానని, నాగేశ్వరరావు ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి అంతా శూన్యమని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. కేవలం తాను ప్రచారం చేయడం వల్లే నాగేశ్వరరావుకు గత ఎన్నికల్లో డిపాజిట్లు వచ్చాయని, అటువంటి తనను ప్రస్తుతం పక్కన పెట్టడం దేనికి సంకేతమన్నారు.
పార్టీని నమ్ముకొని ఉన్న క్యాడర్ ను కాపాడుకోవడంలో జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం పూర్తిగా విఫలమైందని, ఈ సంస్కృతి ఇలాగే కొనసాగితే తాను సైతం పార్టీలో కొనసాగడం కష్టమంటూ ఫైర్ అయ్యారు. పార్టీని నమ్ముకొని ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఏకంగా తనకు సముచిత స్థానం లేదంటూ ప్రకటించి, పార్టీలో కొనసాగలేనడం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రస్తుత స్థితిగతులకు నిలువుటద్దమంటూ రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. కాగా ఈ విషయంపై బీఆర్ఎస్ అధిష్టానం స్పందించి మాజీ ఎమ్మెల్యే ను బుజ్జగిస్తుందా.. లేక సైలెంట్ గా జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తుందా అనేది తేలాల్సి ఉంది.
సొంత పార్టీపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫైర్
తిరుగుబాటు జెండా ఎగురవేసిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు
బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావులు తమ వైఖరి మార్చుకోకుంటే పార్టీకి తీవ్ర నష్టమంటూ ధ్వజం… pic.twitter.com/PPQydB7eQl
— BIG TV Breaking News (@bigtvtelugu) November 17, 2024