Pushpa 2: అల్లు అర్జున్ (Allu Arjun)అభిమానులే కాదు సినీ ప్రేమికులు కూడా ఈగర్ గా ఎదురు చూస్తున్న చిత్రం ‘పుష్ప 2: ది రూల్’.. ‘పుష్ప : ది రైజ్’ సినిమా సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ (Sukumar )కాంబినేషన్లో యాక్షన్ డ్రామా మూవీగా తెరకెక్కుతోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం కూడా అభిమానులను చాలా ఎక్సైట్ చేస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా సినిమాలోని జాతర ఎపిసోడ్ సన్నివేశాలు కూడా బాగా తెరకెక్కించబోతున్నారని సమాచారం.ఇప్పటికే అల్లు అర్జున్ ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గంగమ్మ జాతర ఎపిసోడ్ ఈ సినిమా కథలో చాలా కీలకంగా ఉంటుందనేది అర్థం అవుతోంది.
ఆ ఒక్క సీన్ కోసమే రూ.60 కోట్లు ఖర్చు..
మరోవైపు ఈ సినిమాలో ప్రముఖ నటుడిగా కీలక పాత్ర పోషించారు కిల్లి క్రాంతి(Killi Kranthi). ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన పుష్ప-2 సినిమాలో జాతర సీక్వెన్స్ గురించి తెలిపారు.. దాదాపు ఈ ఒక్క సీక్వెన్స్ కోసమే రూ.60 కోట్లు ఖర్చు చేసి ఈ ఎపిసోడ్ ను చిత్రీకరించారు అని, ఔట్పుట్ నెక్స్ట్ లెవెల్ లో వచ్చింది అని కూడా ఆయన తెలిపారు. క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. పుష్ప 2 జాతర సీక్వెన్స్ కోసం మైత్రి మూవీ మేకర్స్, నిర్మాతలు సుమారుగా రూ.60 కోట్లు ఖర్చు పెట్టారు . ముఖ్యంగా ఈ సినిమాలో ఆ ఒక్క ఎపిసోడ్ దాదాపు 18 నిమిషాలు ఉంటుంది.థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్క ఆడియన్ కూడా ఈ సీక్వెన్స్ చూసి కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా కళ్ళు ఆర్పకుండా.. అందులో బన్నీ యాక్షన్ ని చూస్తూ ఉండిపోతారు. సీక్వెన్స్ పూర్తయిన తర్వాత సీట్లో నుంచి కచ్చితంగా లేచి నిలబడి చప్పట్లు కొడతారు ఇందులో నాది గ్యారెంటీ. నిజంగా అంత అద్భుతంగా ఔట్పుట్ వచ్చింది. డైరెక్టర్ సుకుమార్ ఈ ఎపిసోడ్లో వర్క్ చూసి క్లైమాక్స్ కోసం కూడా అదే ఫైట్ మాస్టర్ కి అవకాశం ఇచ్చారు” అంటూ పుష్ప నటుడు క్రాంతి కుమార్ తెలిపారు. ఇక ఈయన మాటలు విన్న తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఒక్క సీక్వెన్స్ కోసమే రూ .60 కోట్లు ఖర్చు చేశారు అంటే , ఇక సినిమా క్లైమాక్స్ కోసం ఇంకెన్ని కోట్లు ఖర్చు చేశారో అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం
రిహార్సల్స్ కోసం అదనంగా మరో రూ.14 కోట్లు..
జాతర ఎపిసోడ్ కి రూ.60 కోట్లు కాకుండా మేము చేసిన ఆ ఫైట్ రిహార్సల్స్ కి అదనంగా మరో రూ .14కోట్లు ఖర్చు వచ్చింది. అలా ఫేషనేటి ప్రొడ్యూసర్స్ ఉండడం నిజంగా అదృష్టం అని చెప్పాలి అంటూ ఆయన తెలిపారు. ఇకపోతే ఈ జాతర ఎపిసోడ్ మాత్రం 100% సర్ప్రైజ్ చేస్తుందని, సినిమాకి అదే హైలెట్గా నిలవబోతోంది అని కూడా క్రాంతి కుమార్ తెలిపారు. ఇకపోతే 20 రోజులపాటు రిహార్సల్స్ చేసి, 35 రోజుల పాటు షూటింగ్ చేసినట్లు మైత్రి నిర్మాతలు తెలిపారు. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటించగా.. యంగ్ బ్యూటీ శ్రీ లీల ఐటమ్ సాంగ్ చేయబోతున్నారు. ఇందులో శ్రీ లీల కి ఐటెం సాంగ్ కోసం రూ.2 కోట్లు ఇచ్చినట్లు సమాచారం.