Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ ఏడాది కల్కి సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న డార్లింగ్.. తదుపరి సినిమాలను కూడా అదే రేంజ్ లో హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ లిస్ట్ లో రాజా సాబ్, సలార్ 2, స్పిరిట్, ఫౌజీ.. సినిమాలు ఉన్నాయి. కల్కి తరువాత ఫ్యాన్స్ రాజాసాబ్ సినిమాను అంతగా పట్టించుకోవడం లేదు. అందుకు కారణం.. డార్లింగ్ ను యాక్షన్ మోడ్ లోనే చూడాలనుకునే ఫ్యాన్స్.. ఈసారి హార్రర్ కామెడీతో వస్తున్నాడు అని తెలియడమే. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇక ఈ సినిమా తర్వాత డార్లింగ్ ఫాన్స్ అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం స్పిరిట్. అనిమల్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా ప్రభాస్ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.
ఇక తాజాగా ఈ సినిమా నిర్మాత భూషణ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో స్పిరిట్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఎప్పటినుంచో స్పిరిట్ డిసెంబర్ చివరివారంలో సెట్స్ మీదకు వెళ్లనుందని సందీప్ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు భూషణ్ కుమార్ ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. డిసెంబర్ నెలాఖరుకి షూటింగ్ ను స్టార్ట్ చేస్తామని, ఇంకా ఈ సినిమా కోసం క్యాస్టింగ్ మొదలుపెట్టలేదని చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ.. ” ప్రభాస్ సందీప్ లది డ్రీమ్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ రికార్డులు సృష్టిస్తుందని భావిస్తున్నాను. డార్లింగ్ సైతం ఎప్పటినుంచో సందీప్ తో వర్క్ చేయడానికి ఎక్సైటెడ్ గా ఉన్నాడు. ఇక ఈ సినిమాను ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పటినుంచి ఆరు నెలల్లోనే పూర్తి చేసి.. 2026 మధ్యలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నామని” ఆయన తెలిపాడు.
Sundeep Kishan : సపోర్ట్ లేదు అనుకునే వారికి రానా నెంబర్ ఇస్తా
ప్రస్తుతం సందీప్.. ఒకపక్క స్పిరిట్ ఇంకపక్క అనిమల్ పార్క్ స్క్రిప్ట్స్ మీద వర్క్ చేస్తున్నాడు. అందుకే ముందు ఆరు నెలలు స్పిరిట్ ను ఫినిష్ చేసి ఆ తర్వాత ఇంకో ఆరు నెలలు అనిమల్ పార్క్ మీద ఫోకస్ చేయనున్నాడు. అనిమల్ పార్క్ స్క్రిప్ట్ సందీప్ మైండ్ లో ఉంది. అది కచ్చితంగా 2027 ప్రారంభంలో మొదలవుతుంది. అందుకు తగ్గట్టుగానే రణబీర్ డేట్స్ ను లాక్ చేసాం అని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ వార్త వినడంతోనే డార్లింగ్ ఫ్యాన్స్ గుండెల్లో గుబులు మొదలైంది. స్పిరిట్ ఆరు నెలల్లో అంటే ప్రభాస్ ను సందీప్ ఏ రేంజ్ లో వాడతాడో అనేది అర్థమయిపోతుంది. డిసెంబర్ లాస్ట్ వీక్ అంటే రాజాసాబ్ షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ లో బిజీగా ఉండే ప్రభాస్.. అదే సమయంలో స్పిరిట్ షూట్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రభాస్ మ్యానేజ్ చేయడం కష్టం.దీంతో ప్రభాస్ పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది అని చెప్పొచ్చు.
Shruti Haasan : ఏంటో.. మరీ పద్ధతిగా మారిపోయిన పిల్లి కళ్ల సుందరి
ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు ప్రభాస్ ని ఏం చేద్దాం అనుకుంటున్నావ్ వంగా మావా.. మరి అంత తక్కువ సమయం అయితే ఎలా..? కొంచెం సమయం తీసుకోండి. నిదానంగా వచ్చిన పర్వాలేదు డార్లింగ్ ఆరోగ్యం ముఖ్యం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి సందీప్ ఈ సినిమాను ఆరు నెలల్లో ఫినిష్ చేస్తాడా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.