BigTV English
Advertisement

Allu Arjun : డిసెంబర్ మొత్తం పుష్పగాడి హవా.. నీ యవ్వ తగ్గేదేలే..

Allu Arjun : డిసెంబర్ మొత్తం పుష్పగాడి హవా.. నీ యవ్వ తగ్గేదేలే..

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రానికి డిసెంబర్ మొత్తం కలిసి వచ్చేలా ఉంది. బరిలో ఉన్న గేమ్ చేంజర్ వాయిదా పడింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ఫ హవానే కనిపించేలా ఉంది. సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయ్యే వరకు పుష్ప గాడికి అడ్డే లేదని తెలుస్తుంది. డిసెంబర్లో రావాల్సిన స్టార్ హీరోల సినిమాలు ఒక్కొక్కటిగా డేట్ ను పోస్ట్ ఫోన్ చేసుకుంటున్నాయి. అదే పుష్ప 2 సినిమాకు ప్లస్ అయ్యింది. డిసెంబర్ నెల ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఇన్ని రోజులు ఎదురుచూశారు. కానీ ఇప్పుడు వార్ వన్ సైడ్ అయిపోయింది. డిసెంబర్ 6న అల్లు అర్జున్ పుష్ప 2 వస్తుంది. సోలో ఫైటర్ గా సినిమా రాబోతుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.


అల్లు అర్జున్ తన మ్యానరిజం తో, యాట్టిట్యూడ్ తో పుష్ప సినిమాను సూపర్ హిట్ అయ్యేలా చేశాడు. నార్త్ ఆడియెన్స్‌కు పుష్ప బాగా ఎక్కేసింది. అందుకే పుష్ప అక్కడ వంద కోట్లు కొల్లగొట్టేసింది. ఓవర్సీస్ ఆడియెన్స్‌కి సైతం పుష్ప బాగానే ఎక్కింది. అక్కడ కూడా కోట్లు కొట్టేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే పుష్ప అక్కడక్కడా నష్టాల్ని తెచ్చి పెట్టింది. ఇప్పుడు రెండో పార్టుతో అన్ని బాకీలను తీర్చేలా ఉన్నాడు అల్లు అర్జున్.. అనుకున్న టైం కన్నా కాస్త గ్యాప్ తీసుకొని కరెక్ట్ టైంకే థియేటర్ల లోకి వచ్చేస్తున్నాడు. గత మూవీ కన్నా ఇప్పుడు వచ్చే మూవీ పై సుకుమార్ కూడా బాగానే ఫోకస్ పెట్టాడు. 1000 కోట్లు కొట్టాలని కసితో ఉన్నాడు.

ఈ మూవీ మిలిగిన పార్ట్ ను రెండు మూడు యూనిట్లుగా చీలి మరి పుష్ప 2ని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఇక ఆల్రెడీ ఫస్ట్ హాఫ్‌ను ఎడిట్ చేసి, లాక్ చేసి పెట్టామని తెలిపారు. ఈ మూవీని అక్టోబర్ ఎండింగ్ లోపు పూర్తి చేసి ప్రమోషన్స్ మొదలు పెట్టాలని పుష్ప 2 టీమ్ అభిప్రాయ పడుతున్నారు. ఈ సినిమాకు ఎక్కువ నార్త్ స్టేట్స్ లో క్రేజ్ ఎక్కువ అందుకే అక్కడే ఎక్కువగా ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యాలనే భావిస్తున్నారు. అక్టోబర్ ఎండ్ కల్లా షూట్ పూర్తి చేసి, నవంబర్‌లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు, చివరి వారంలో సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. డిసెంబర్ 6న ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను విడుదల చేస్తామని మైత్రీ ప్రకటించింది. పుష్ప గాడు డిసెంబర్ నెలలో దున్నెసేస్తాడని తెలుస్తుంది. సంక్రాంతి వరకు ఈ సినిమాకు పోటి లేదు.. దాంతో కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని టాక్.. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఇప్పటివరకు విడుదలైన, పోస్టర్స్ సాంగ్స్ కు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పుష్ప 2 టైటిల్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకాట్టుకుంది..  ఈ మూవీ తర్వాత బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చెయ్యనున్నారని సమాచారం..


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×