E-Paper
Advertisement

Professor Saibaba : మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత… సంతాపం తెలిపిన సీపీఐ నారాయణ

Professor Saibaba : మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత… సంతాపం తెలిపిన సీపీఐ నారాయణ
Advertisement

Professor Saibaba : దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శనివారం రాత్రి ప్రాణం విడిచారు.

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో సాయిబాబాను 2014లో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు 2017లో జీవితఖైదు విధించింది. సుమారు 9 సంవత్సరాలు ఆయన జైలులోనే మగ్గిపోయారు. ఈ కారణంగా ఆయన యూనివర్సిటీ నుంచి సైతం సస్పెండ్ అయ్యారు.

Advertisement

నిర్దోషిగా తీర్పిచ్చిన బాంబే హైకోర్టు…

మహారాష్ట్ర సెషన్స్ కోర్టు సాయిబాబాకు మరో ఐదుగురు మావోయిస్టులు మహేష్ తిర్కీ, పాండు నరోటే, హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహి, విజయ్ టిర్కీతో సంబంధాలు ఉన్నాయని మార్చి 2017లో తేల్చింది. దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేసే కార్యకలాపాలలో పాల్గొన్నారన్న అభియోగాలతో దోషులుగా కోర్టు నిర్ధారించింది. ఈ క్రమంలోనే జైలు శిక్ష అనుభవిస్తున్న సాయిబాబాకు ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. తాజాగా కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Advertisement

రాజీలేని పోరాటం…

మరోవైపు ప్రాఫెసర్ సాయిబాబా మరణం పట్ల సీపీఐ జాతీయ నేత డా.కె. నారాయణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నిజ జీవితంలో శారీరక వైకల్యం ఉన్నా, ప్రభుత్వ నిర్బంధాన్ని సైతం ఎదిరించిన ధీరుడని కీర్తించారు. ఆయన జీవితాంతం చేసిన రాజీలేని పొరాటంలో విజయం సాధించారన్నారు. పోరాటయోధులు సాయిబాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా పోరాట రీత్యా మనతోనే ఉన్నారన్నారు. వారి మరణం పట్ల వారి కుటుంబసభ్యులకు మరోసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు.

Also read : పరువు లేని నాగార్జున.. దావా వేయడం ఎందుకు? బిగ్ బాస్ షో లక్ష్యంగా నారాయణ కామెంట్స్

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×